10 రోజుల్లో రిలీజ్.. సలార్ నుంచి ఒక్క పాట కూడా రాలేదే, అనేక అనుమానాలు ?

By Asianet NewsFirst Published Dec 11, 2023, 9:48 AM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.  దీనితో ఇటీవల సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ లో చాలా గ్రాండ్ గా కనిపించింది. అయితే ఎక్కువగా కేజీఎఫ్ ఛాయలు ఉండడం, ప్రభాస్ పాత్రని ఆశించిన స్థాయిలో హైలైట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. సలార్ ట్రైలర్ పూర్తి స్థాయిలో కిక్కు ఇవ్వలేదు అనేది వాస్తవం. 

Latest Videos

దీనికి తోడు ప్రచార కార్యక్రమాలు కూడా నత్త నడకగా సాగుతున్నాయి. రిలీజ్ కి పట్టుమని పది రోజులు కూడా లేదు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ప్రశాంత్ నీల్ వైఖరి ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. కెజిఎఫ్ 2 రిలీజ్ కి చాలా రోజుల ముందు నుంచి హంగామా సాగింది. పాటలు కూడా రిలీజ్ చేశారు. 

కానీ సలార్ నుంచి ఒక్క పాట కూడా ఇంతవరకు రాలేదు. సలార్ మూవీలో సాంగ్స్ తక్కువే. సలార్ థీమ్ సాంగ్ తో పాటు ఒక మాంటేజ్ సాంగ్ ఉందట.. ఆ పాటలని అసలు రిలీజ్ చేస్తారా చేయరా అనేదానికి ఫ్యాన్స్ కి ఇంతవరకు సమాధానం రాలేదు. అయితే సలార్ టీమ్ మాత్రం రెండవ ట్రైలర్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సెకండ్ ట్రైలర్ లాంచ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందట. అయితే ఏ విషయంలో క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడో మరి. శృతి హాసన్, పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!