
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ పెద్ద హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం.. నాని కెరీర్ లో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా.. నానికి అతి పెద్ద హిట్ అందించింది. ప్రపంచవ్యాప్తంగా దసరా మూవీ రెండు వారాల్లో రూ.112 కోట్లు వసూలు చేయడం విశేషం. దసరా మూవీ రిలీజైన సమయంలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినా ప్రమోషన్స్ తో వాటిని దాట గలిగారు. మూవీ యూనిట్ కరీంనగర్ లో దసరా బ్లాక్ బస్టర్ ధావత్ కూడా చేసుకుంది. నానీకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం డైరక్టర్ హాట్ ప్రాపర్టీగా మారిపోయాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా పేరు చెప్పి నాని కు నష్టం కూడా వచ్చిందని మీడియా వర్గాల సమాచారం. అదెలాగ అంటే..
ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో నాని కొంచెం పట్టు,విడుపులుగా వ్యవహరించాడు. పూర్తి రెమ్యునరేషన్ తీసుకుని నిర్మాతపై భారం పెట్టడం ఇష్టం లేక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తన రెమ్యునరేషన్ లో భాగంగా తన దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్టయినా కూడా ఏ ఛానెల్ తీసుకోలేదు. తన రెమ్యునరేషన్ లో భాగంగా శాటిలైట్ హక్కుల్ని ఉంచుకున్న నానికి ఇది పెద్ద నష్టం అంటున్నారు. అందుకు కారణం శాటిలైట్ రైట్స్ కు ఇంతకు ముందులా డిమాండ్ లేదు. అంతంత రేట్లు పెట్టి టీవి ఛానెల్స్ వాళ్లు కొనటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ థియేటర్ లో , ఓటిటిలో చూసిన సినిమాలను టీవీల్లో చూడటానికి ఎవరూ ఇష్టపడటం లేదు.
దాంతో శాటిలైట్ ఛానెల్స్ కి కూడా యాడ్స్ రూపంలో భారీ మొత్తం కు దెబ్బ పడింది. ఈ క్రమంలో చిన్నాపెద్దా అని తేడా లేకుండా అన్ని సినిమాలు కొనేటప్పుడు ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. కాకపోతే నిర్మాతకు ఓటిటి హక్కుల ద్వారా భారీ మొత్తం వస్తోంది నిర్మాతలకు. ఓటిటి రైట్స్ దగ్గర పెట్టుకున్నా నానికి మంచి ఎమౌంట్ వచ్చేది అంటున్నారు.
ఇక చాలా సినిమాలు శాటిలైట్ రైట్స్ అమ్ముడవక అలా ఉండిపోతున్నాయి. రానా నటించిన ‘విరాటపర్వం’ గతేడాది థియేటర్లలో విడుదలయింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఏ ఛానెల్ తీసుకోలేదు. అలాగే ‘శాకుంతలం’, ‘దసరా’, ‘రామబాణం’ సినిమాలను కూడా ఏ ఛానెల్ కొనలేదని సమాచారం. ఈ సినిమాల ఓటిటి హక్కులు మాత్రం భారీ మొత్తానికి అమ్ముడై నిర్మాతలకు బాగానే రిలీఫ్ ఇచ్చాయి.