
ఇస్మార్ట్ శంకర్ సినిమాతరువాత నుంచి అదే మాస్ ఇమేజ్ ను ఇంకా పెంచుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేశాడు రామ్ పొతినేని. కాని ఆరువాత రామ్ చేసిన సినిమాలన్నీ వరుస ప్లాప్స్ గా నిలిచాయిజ ఈసారి ఎలాగైన హిట్టు కొట్టాలనే పట్టుదలతో మాస్ సినిమాలకు బాప్.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు రామ్ పోతినేని. RAPO20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కతోన్న ఈసినిమ మై భారీ అంచాలు ఉన్నాయి.
ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను... యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ క్రేజీ కాంబోలో సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. RAPO20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ లాంఛ్ చేసిన లుక్స్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అందించారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.
RAPO20 షూటింగ్ పనులు దాదాపు అయిపోయినట్టే.. ఇక ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు టీమ్. ఈమూవీ డబ్బింగ్ పనులు ముందుగా మొదలయ్యాయి.అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నారు. బోయపాటి డబ్బింగ్ స్టూడియోలో ఉన్న స్టిల్‌ను ట్వీట్ చేస్తూ.. డబ్బింగ్ ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యింది. ఊరమాస్ అవతార్‌లో ఉన్న ఉస్తాద్ రామ్‌ను కలిసేందుకు రెడీగా ఉండండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రామ్ స్టైలీష్ లుక్ ఆకట్టుకుంది. దానితో పాటు మరో లుక్ కూడా ఆడియన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.