లేడీ నక్సల్ గా నివేదా పేతురాజ్

By team teluguFirst Published Jul 17, 2021, 9:25 AM IST
Highlights

విరాట పర్వం మూవీలో నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ మేరకు ఆమె తాజా ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి వెల్లడించారు. విరాటపర్వం మూవీలో నివేదా ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేస్తున్నారట.

రానా-సాయి పల్లవి జంటగా దర్శకుడు వేణు ఉడుగుల విరాటపర్వం తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ రివల్యూషనరీ డ్రామాగా విరాటపర్వం రూపొందుతుంది. కాగా విరాట పర్వం మూవీలో నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ మేరకు ఆమె తాజా ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి వెల్లడించారు. విరాటపర్వం మూవీలో నివేదా ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేస్తున్నారట. 


ఆమె లేడీ నక్సలైట్ గా కనిపించనుండగా, ఆ పాత్ర కోసం మూడు రోజులు షూటింగ్ లో పాల్గొన్నారట. హైదరాబాద్ శివారులోని అడవుల్లో కఠిన పరిస్థితుల మధ్య యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. భారీ వర్షంలో సాగిన షూటింగ్ కారణంగా తనకు వాళ్లంతా నొప్పులు వచ్చాయని ఆమె తెలిపారు. చిన్న పాత్ర కోసం కూడా చాలా కష్టపడినట్లు నివేదా తెలిపారు. అలాగే ఆమె గతంలో ఎన్నడూ చేయని ఓ ఛాలెంజింగ్ రోల్ చేసినట్లు అభిప్రాయపడ్డారు. 


విరాట పర్వం మూవీలో మరో హీరోయిన్ ప్రియమణి సైతం లేడీ నక్సలైట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అలవైకుంఠపురంలో మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన నివేదా, తెలుగులో బిజీగా అవుతున్నారు. పాగల్,చందు మొండేటి చిత్రాలలో నటిస్తున్నారు. 
 

click me!