అప్పులవాళ్లు ఎక్కడెక్కడో తాకేవారు: లేడీ కమెడియన్ వెల్లడి

Published : Jul 17, 2021, 08:28 AM ISTUpdated : Jul 17, 2021, 08:31 AM IST
అప్పులవాళ్లు ఎక్కడెక్కడో తాకేవారు: లేడీ కమెడియన్ వెల్లడి

సారాంశం

 లేడీ కమెడియన్ భారతీ సింగ్  లైంగిక వేధింపుల పై స్పందించారు. అలాగే తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలు వెల్లడించారు. 


పరిశ్రమ ఏదైనా ఆడవాళ్లకు లైంగిక వేధింపులు చాలా కామన్. గ్లామర్ ఇండస్ట్రీలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది అనేది నానుడి. మాటల ద్వారా, చేతల ద్వారా ఆడవాళ్లను వేధించే మగాళ్లు ఎందరో ఉన్నారు. లేడీ కమెడియన్ భారతీ సింగ్ ఈ లైంగిక వేధింపుల పై స్పందించారు. అలాగే తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలు వెల్లడించారు. 

కొన్ని ఈవెంట్స్ లో నిర్వాహకులు తాక కూడని చోట తాకుతూ ఉండేవారు. అది పొరపాటున జరిగి ఉంటుంది, నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నాని చాలా సార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకునేడదానిని. అయితే వాళ్ళు కావాలనే తాకుతున్నారని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అలా తాకడం నాకు నచ్చేది కాదు. మీ పిచ్చి చేష్టలు ఆపండి అంటూ గట్టిగా చెప్పాలని అనిపించేది. నేను అప్పుడు చిన్నదాన్ని కావడంతో అంత ధైర్యం ఉండేది కాదు.. అని భారతీ సింగ్ అన్నారు. 

అలాగే వాళ్ళ అమ్మ విషయంలో అప్పుల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పు ఇచ్చిన వాళ్లకు అమ్మను తాకుతూ మాట్లాడేవారు. కొందరు భుజంపై చేయివేసి మాట్లాడేవారు. నాకు చిన్న పిల్లలు, భర్తలు లేరు ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదా? అని అమ్మ అనేది. వాళ్ళ ప్రవర్తనను అమ్మ ప్రశ్నించేది. వాళ్ళు అమ్మను లైంగికంగా వేధిస్తున్నారని నాకు అప్పుడు తెలియలేదని, భారతీ సింగ్ తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి