నిత్యా మీనన్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published : Nov 13, 2018, 05:34 PM IST
నిత్యా మీనన్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

సారాంశం

తెలుగు తమిళ్ అని తేడా లేకుండా సౌత్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామీనన్. సాధారణంగా హీరోయిన్స్ అవకాశాలు వస్తున్న కొద్దీ చాలా మారిపోతుంటారు. గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచేస్తుంటారు. కానీ నిత్య మాత్రం తనకు నచ్చిన పాత్రలను చేస్తూ గ్లామర్ గీతను ఎప్పుడు ఓవర్ టెక్ చేయలేదు. 

అమ్మడు నటించిన మొదటి బాలీవుడ్ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ప్రయోగాత్మక చిత్రం మిషన్ మంగళ్ చిత్రంలో నిత్యా మీనన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కోసం నిత్యా సన్నబడింది కూడా. అయితే సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా తెలిపింది. 

2019 ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక విద్యా బాలన్ - సోనాక్షి సిన్హాతో పాటు సొట్టబుగ్గల సుందరి తాప్సి కూడా సినిమాలో నటించింది. ఫీమేల్ మల్టీస్టారర్ గా రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శక్తి జగన్ ఈ ప్రయోగాత్మక చిత్రానికి దర్శకత్వం వహించారు.

PREV
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు