
ఈ మధ్య స్టార్స్ అంతా సోషల్ మీడియాతో తమంకంటూసొంత ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటి ద్వారా కూడా సంపాధంచుకువఉన్నారు. ఇక వి సరసన చేరింది మలయాళ ముద్దు గుమ్మ నిత్య మీనన్. సోంతగా యూట్యూబ్ లో ఓ ఛానెల్ ఓపెన్ చేసింది.
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మెరుపులు మెరిపించింది నిత్యమీనన్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలుచేసిదూకుడు చూపించిన స్టార్ హీరోయిన్.. ఆతరువాత డల్ అయ్యింది. ఇక అడపా దడపా స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్‌తో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది నిత్యా మీనన్. భీమ్లానాయక్ లో పవన్ భార్యగా అలరించింది.
ఈ పాత్రలో నిత్యమీనన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక నిత్య తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి అనుకుంటుంది. అందుకే అనుకున్నదే తడవుగా.. తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది నిత్యమీనన్. తాను సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసింది.
నిత్య అన్ ఫిల్టర్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ అనౌన్స్ చేసింది బ్యూటీ. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ లో మొదటి వీడియోగా సినిమా కెరీర్ లో తన 12 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన విషయాలను తొలి వీడియోగా షేర్ చేసింది నిత్య. తన వ్యక్తిగత,వృత్తిపరమైన జీవిత విశేషాలపై మరిన్ని వీడియోల తో త్వరలో సందడి చేస్తానంటోంది
తన మూవీ కెరీర్ లో కమర్షియల్ సినిమాలు చేసినా.. ఎక్కవగా కథాపరంగా తనకు ప్లస్ అయిన మంచి సినిమాలనే చేసుకుంటూ వచ్చింది నిత్య. తనకు నచ్చని సినిమాలను ఎంత పెద్ద స్టార్ అమయినా వెంటనే రిజెక్ట్ చేసేది మీనన్. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా త్వరలోనే మరిన్ని విశేషాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయని తెలిపింది నిత్యమీనన్. తక్కువ సమయంలో ఈ ఛానల్‌కు వేల మంది ఫాలోవర్లు చేరిపోవడం విశేషం.