షాకిచ్చిన నితిన్ “చెక్” టీఆర్పీ రేటింగ్ ?

Surya Prakash   | Asianet News
Published : Jul 23, 2021, 07:53 PM IST
షాకిచ్చిన నితిన్ “చెక్” టీఆర్పీ రేటింగ్ ?

సారాంశం

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటేనే కొత్తదనంతో కూడిన  సినిమాలనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఈయన నితిన్‌తో ‘చెక్’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేసాడు.  

నితిన్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో భారీ డిజాస్టర్  చిత్రం “చెక్”. చంద్రశేఖర్ యేలేటి తీసిన ఈ మూవీ రెండో రోజుకే జనాలు లేకుండా పోయారు. నితిన్ ఫాలోయింగ్, యేలేటి మ్యాజిక్ పనికిరాకుండా పోయాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత చాలా థియేటర్ల నుంచి లేపేశారు. రివ్యూలలో క్రిటిక్స్ చీల్చి చెండాడారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఈ స్దాయి ఫ్లాఫ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.  ఈ స్దాయిలో  ప్లాప్ అయిన సినిమాని ఇక టీవీల్లో ఎవరు చూస్తారు అనుకుంటాం. కానీ, విచిత్రంగా ఈ సినిమాకు టీవీల్లో మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. జెమినీ టీవీలో గత వారం ప్రీమియర్ గా ప్రసారం అయిన ఈ సినిమా పై జనం బాగానే ఆసక్తి చూపించటంతో వార్తల్లో నిలిచింది.

  జెమినీ టీవీలో గత వారం ప్రీమియర్ గా ప్రసారం అయింది ఈ సినిమా.  ఈ సినిమాకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో 8.53 రేటింగ్ వచ్చింది. నితిన్ సినిమాలకు కిది మంచి రేటింగ్. మొన్న జీటీవోలో ప్రసారం అయిన ‘రంగ్ దే’ కన్నా ఎక్కువ వచ్చింది. ‘రంగ్ దే’ సినిమాకి 7.22 వస్తే దీనికి ఏకంగా 8.53 వచ్చింది. అంటే థియేటర్లో కాస్త బెటర్ గా ఆడిన ‘రంగ్ దే’ టీవీలో మాత్రం అసలు వర్కవుట్ కాలేదు. 

ఈ చిత్రం బుల్లితెర పై ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారీర్, సిమ్రాన్ చౌదరీ, మురళి శర్మ, హర్ష వర్ధన్, పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్, కార్తీక్ రత్నం లు కీలక పాత్రల్లో నటించారు. కథ ప్రకారం ఆదిత్య (నితిన్) టెర్రరిజం కేసులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ. ఈ జైలులో తన సహచర ఖైదీగా చెస్‌లో ప్రావీణ్యం ఉన్న మరో వ్యక్తి (సాయి చంద్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో  ఉరి శిక్ష పడ్డ ఖైదీ ఎలా చెస్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. అసలు ఆదిత్యకు ఉరిశిక్ష ఎందుకు పడింది. అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? చివరకు ఆదిత్య ఉరిశిక్ష నుంచి బయటపడ్డాడా లేదా అనేదే ‘చెక్’ సినిమా స్టోరీ.
 

PREV
click me!

Recommended Stories

కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ
చిరంజీవి తన భార్య సురేఖకు నేర్పించిన రెండు స్పెషల్ వంటలు ఏంటో తెలుసా? అల్లు వారిపై మెగాస్టార్ ఫన్నీ కౌంటర్