కళ్లు కనబడవు..వెనకాల రక్తపు మరకలు: ‘మాస్ట్రో’ ఫస్ట్ లుక్

Surya Prakash   | Asianet News
Published : Mar 30, 2021, 07:24 AM ISTUpdated : Mar 30, 2021, 09:21 AM IST
కళ్లు కనబడవు..వెనకాల రక్తపు మరకలు: ‘మాస్ట్రో’ ఫస్ట్ లుక్

సారాంశం

రీసెంట్ గా రంగ్ దే చిత్రంతో పలకరించిన నితిన్ ఇప్పుడు మరో చిత్రాన్ని మేకప్ చేసి రెడీ చేస్తున్నాడు. మంగళవారం నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్టు ప్రకటించడంతోపాటు... ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

రీసెంట్ గా రంగ్ దే చిత్రంతో పలకరించిన నితిన్ ఇప్పుడు మరో చిత్రాన్ని మేకప్ చేసి రెడీ చేస్తున్నాడు.  నితిన్ హీరోగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. నితిన్‌కి జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. తమన్నా కీ రోల్ ని పోషిస్తోంది. మంగళవారం నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్టు ప్రకటించడంతోపాటు... ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

హిందీలో విజయవంతమైన ‘అంధాదున్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. జూన్‌ 11న విడుదల చేయబోతున్నారు. ఇందులో నితిన్‌ అంధుడిగా కనిపించనున్నారు. ఫస్ట్‌ లుక్‌ ఇంట్రస్టింగ్ గా  ఉంది. తాజాగా విడుదలైన ఫస్ట్‏లుక్ పోస్టర్‏లో చేతిలో స్టిక్ పట్టుకోని నడుస్తున్నాడు. అంటే ఈ మూవీలో అతను కళ్లు కనపడని వ్యక్తిలా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. నితిన్ వెనకాల ఉన్న పియానో పై రక్తపు మరకలు ఉన్నాయి.

 ఓ కళ్లు కనపడని వ్యక్తి వెనకాల రక్తపు మరకలు ఉండడంతో ఈ వ్యక్తి హత్య చేశాడనే అనుమానం కలిగించేలా పోస్టర్ విడుదల చేసింది యూనిట్. అయితే నితిన్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ఎప్పుడూ నటించలేదు. దీంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.  

‘‘నితిన్‌ ఇదివరకెప్పుడూ చేయని ఓ విలక్షణ పాత్రని ఇందులో పోషిస్తున్నారు. పరిశ్రమ వర్గాలతోపాటు నితిన్‌ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘భీష్మ’ చిత్రానికి స్వరాలు సమకూర్చిన మహతి స్వరసాగర్‌ ఈ చిత్రానికి సుమధురమైన బాణీలు అందిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టుగా చిత్రం అలరిస్తుంద’’ని టీమ్ చెప్తోంది. ఈ చిత్రానికి సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: సాహి సురేష్‌, ఛాయాగ్రహణం: జె.యువరాజ్‌.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం