కరోనా ఎఫెక్ట్: 'సర్కారు వారి పాట' షూట్ కాన్సిల్?

ఒకవైపు కరోనా భయపెడుతున్నా మరోవైపు టాలీవుడ్ లో  ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కాయి. సంక్రాంతి నుంచి రిలీజ్ లు ఊపందుకున్నాయి. కరోనా తగ్గింది అని ఉత్సాహడినంత సేపు పట్టలేదు. మళ్లీ కేసులు పెరగటం మొదలైంది. అప్పటికీ స్టార్  హీరోలు సైతం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు షురూ చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ లో కరోనా సోకుతుండటంతో షూటింగ్ లు చేసే విషయంపై మళ్లీ పునరాలోచనలో పడుతున్నారు. 

COVID19 cases: Trouble for Sarkaru Vaari Paata jsp

ఒకవైపు కరోనా భయపెడుతున్నా మరోవైపు టాలీవుడ్ లో  ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కాయి. సంక్రాంతి నుంచి రిలీజ్ లు ఊపందుకున్నాయి. కరోనా తగ్గింది అని ఉత్సాహడినంత సేపు పట్టలేదు. మళ్లీ కేసులు పెరగటం మొదలైంది. అప్పటికీ స్టార్  హీరోలు సైతం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు షురూ చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ లో కరోనా సోకుతుండటంతో షూటింగ్ లు చేసే విషయంపై మళ్లీ పునరాలోచనలో పడుతున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురాం కాంబినేషన్ లో  సర్కారు వారి పాట టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కరోనా ప్రభావం ఎక్కువ కాలమే పడింది.  వాస్తవానికి ఈ  సినిమా యూనిట్ అమెరికాకు వెళ్లి అక్కడ షూటింగ్ కోసం కావాల్సిన లొకేషనల్లు కూడా చెక్ చేసుకుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేవ్ చూసి షెడ్యూల్ కాన్సిల్ చేసారు. ఇక్కడ గోవాలో ఆ షెడ్యూల్ తీద్దామని  ఫిక్స్ అయ్యిపోయారు. అయితే ఇప్పుడా షెడ్యూల్ ని కూడా కాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఇండియాలో సెకండ్ వేవ్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతూండటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. ఇప్పటికే దుబాయి షెడ్యూల్ పూర్తి అవటం కొంతలో కొంత కలిసొచ్చింది. 
 
ఇక మహేష్ బాబు ఈ చిత్రం దర్శకుడు పరుశరామ్ తో షూటింగ్ ని సెప్టెంబర్ లోపల పూర్తి చేయమని పురమాయించినట్లు సమాచారం. అప్పుడే సంక్రాంతి 2021కు రిలీజ్ చేయగలుగుతారు.  ఈ క్రమంలో కరోనా ప్రభావితం కానీ  ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేయాలని డైరక్టర్ ఫిక్స్ అయ్యి..వెతుకుతున్నారట. 

Latest Videos

గీత గోవిందం లాంటి సక్సెస్ తర్వాత దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తోన్న మూవీ ఇది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ జత కట్టింది. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
 
vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image