నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది

First Published Apr 2, 2018, 12:53 PM IST
Highlights
నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది

నితిన్ కు ఒక వింతైన చేదు అనుభవం ఎదురైంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ పుణ్య క్షేత్రాల సందర్శనలో ఉన్న నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది. దర్శనం కోసం వచ్చిన నితిన్ ను కారణం చెప్పకుండా అక్కడి ఆలయ అలంకరణ పర్యవేక్షకులు సీతారామాచార్యులు  తాళ్ళతో కట్టి తీసుకెళ్ళి ఆలయ ప్రధానాచార్యులు రాజగోపాల్ ముందు హాజరు పరిచారు. అయోమయంలో ఉన్న నితిన్ ను రాజగోపాల్ నిలదీస్తూ స్వామి వారి ఉంగరం దొంగలించడం భావ్యం కాదని పైగా బాగా డబ్బున్న మీ లాంటి సినిమా హీరోలు చేయాల్సిన పని కాదని ఆయన చెప్పడంతో ఒక్క క్షణం నితిన్ కు నోట మాట రాలేదు. వెంటనే కోలుకుని అలాంటిది ఏమి లేదని కావాలంటే తనీఖీ చేసుకోమని చెప్పేసాడు

ఉంగరం పోయింది శనివారం రాత్రే కాబట్టే అది దొరికే దాకా  బందీలుగా ఉండాల్సిందే అని రాజగోపాల్ తేల్చి చెప్పడంతో నితిన్ కు చాలా సేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈలోగా ఇదే అభియోగం మీద మరికొందరు భక్తులను కూడా అక్కడి సిబ్బంది ఇదే తరహాలో తాళ్ళతో కట్టి అక్కడికి తీసుకువచ్చారు. ఇంకేముంది అందరు ఘోల్లుమంటూ ఒకటే ఏడుపు. నితిన్ మాత్రం ఇందులో ఏదో మతలబు ఉందని సైలెంట్ గా చూడటం మొదలుపెట్టాడు.

నిజానికి ఈ తతంగం అంతా నిజం కాదు. ప్రతి ఏటా జరిగే వరాహ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా వినోదోత్సవం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. దీంట్లో భాగమే ఈ దొంగల దోపు ఉత్సవం. స్వామి వారు ఒకసారి విహార యాత్రకు వెళ్ళినప్పుడు ఉంగరం పోగొట్టుకుని రావడంతో అది ఉంటేనే రమ్మని అమ్మవారు షరతు పెడతారు. తన తరఫు దూతగా వైదికుడిని ఒకరిని పంపించి అనుమానం ఉన్న భక్తులను విచారణకు తీసుకువస్తారు. దాన్ని యధాతధంగా ఈ రూపంలో గుడిలో నాటకం తరహాలో నిజంగా నడిపిస్తారు. నిజానికి భక్తులెవరు దొంగతనం చేయలేదన్నమాట. మొత్తం విన్న భక్తులు హమ్మయ్య అని చిరునవ్వులతో బయలుదేరగా నితిన్ మాత్రం ఏంటయ్యా నీ లీల సినిమా విడుదల దగ్గర ఉందని తనకో కొత్త అనుభూతి కలిగిస్తావా అంటూ ఆనందంగా బయటికి వచ్చాడట. అదండీ విధి ఆడిన దేవుడి నాటకంలో దొంగగా మారాల్సి వచ్చిన నితిన్ కథ. 

click me!