న్యూ లుక్ లో నితిన్.. ఆశలన్నీ ఆ కథపైనే!

By Prashanth MFirst Published Oct 15, 2018, 5:08 PM IST
Highlights

అఆ అనంతరం లై - చల్ మోహన రంగ మరియు శ్రీనివాస కళ్యాణం సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ చూశాడు. ఇక ప్రస్తుతం ఛలో సినిమాతో కమర్హియల్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 

ఇటీవల కాలంలో సక్సెస్ అందుకోవడానికి నానా తంటాలు పడుతున్న యువ హీరోల్లో నితిన్ కూడా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా మార్కెట్ ను బాగానే బ్యాలెన్స్ చేస్తున్నప్పటికీ సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు. అఆ అనంతరం లై - చల్ మోహనరంగ మరియు శ్రీనివాస కళ్యాణం సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ చూశాడు. 

ఇక ప్రస్తుతం ఛలో సినిమాతో కమర్హియల్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దర్శకుడు చెప్పిన కథపై నితిన్ కు చాలా నమ్మకం ఏర్పడిందట. అందుకే సరికొత్త లుక్ లో కనిపించాలని ఫిజికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తున్నాడు. కొంత వెయిట్ తగ్గి బాడీని సరికొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. హెయిర్ స్టైల్ కూడా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. 

మొత్తంగా తన సరికొత్త లుక్ తోనే సినిమాకు క్రేజ్ రావాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఆ వర్క్ ఫినిష్ చేసి సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ దర్శకుడు వెంకీ ప్లాన్ చేసుకుంటున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటించనుంది.

click me!