నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్ విడుదల తేదీ ఫిక్స్డ్ !

Published : Feb 19, 2021, 09:11 AM IST
నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్ విడుదల తేదీ ఫిక్స్డ్ !

సారాంశం

అంధాదున్ తెలుగు రీమేక్ విడుదల తేదీని చిత్ర యూనిట్ విడుదల చేశారు. జూన్ 11న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ప్రయోగాత్మక పాత్రలో నితిన్ ఎలా ఉంటాడో చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరనుంది. 

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అంధాదున్ చిత్రాన్ని తెలుగు హీరో నితిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాత్మక చిత్రంలో నితిన్ అంధుడైన, మ్యుజీషియన్ గా కనిపించనున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో,  తమన్నా కీలక రోల్ చేస్తున్నారు. మొదటిసారి తమన్నా నెగెటివ్ రోల్ చేయడం విశేషం. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

కాగా అంధాదున్ తెలుగు రీమేక్ విడుదల తేదీని చిత్ర యూనిట్ విడుదల చేశారు. జూన్ 11న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ప్రయోగాత్మక పాత్రలో నితిన్ ఎలా ఉంటాడో చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరనుంది. అంధాదున్ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. 

మరోవైపు నితిన్ నటించిన చెక్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 26న చెక్ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. నితిన్ కి జంటగా ప్రియా ప్రకాష్ వారియర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించారు . ఉరి శిక్ష పడిన చెస్ ప్లేయర్ గా నితిన్ ఈ మూవీలో కనిపించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

PREV
click me!

Recommended Stories

Toxic Postponed: టాక్సిక్ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ ఇదే.. బాక్సాఫీసు వద్ద `దురందర్‌ 2` ఊచకోత
Vijay Devarakonda - Rashmika: విజయ్, రష్మికల నగల ధర ఎంతో తెలుసా.? ఏకంగా మూడు విల్లాస్ కొనొచ్చు..