
2018లో విడుదలైన హిందీ చిత్రం అంధాదున్ సంచలన విజయం సాధించింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన అంధాదున్ మూవీలో రాధికా ఆప్టే హీరోయిన్. ఇక లేడీ విలన్ గా హీరోయిన్ టబు చేయడం విశేషం. ఆ చిత్రాన్ని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ అంధాదున్ తెలుగు రీమేక్ తెరకెక్కిస్తున్నారు. నేడు నితిన్ బర్త్ డే నేపథ్యంలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి మాస్ట్రో అనే టైటిల్ నిర్ణయించడం జరిగింది. కాగా మాస్ట్రో ఫస్ట్ గ్లిమ్స్ వీడియో సైతం విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. పియానో ప్లే చేస్తున్న నితిన్ తో మొదలైన ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో అతన్ని ఎవరో హత్య చేస్తున్న సీన్ తో ముగిసింది. వీడియోలో బీజీఎమ్ అద్భుతంగా, సరికొత్తగా ఉంది.
మాస్ట్రో మూవీలో నితిన్ గుడ్డివాడైన పియానో ప్లేయర్ గా కనిపించనున్నారు. ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్నా కీలకమైన నెగెటివ్ రోల్ చేస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మహతి స్వరసాగర్.