ఈ కమర్షియల్ యాడ్ ని ‘స్నేహ చికెన్ – ది చికెన్ ఆంథమ్’ అనే పేరుతో రిలీజ్ చేసారు. ఈ యాడ్ లో హీరో నితిన్ కి తల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కనపడింది. ”ఈ అమ్మలు ఎప్పుడూ ఇంతేనండి. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రశ్నకు స్నేహ ఫ్రెష్ చికెన్ సమాధానమయితే ప్రతి అమ్మకి ఇక పండగే” అని నితిన్ ప్రమోట్ చేస్తున్నాడు
నితిన్ మెల్లిగా యాడ్స్ బాట పట్టారు. ఆయన సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా నటిస్తూ సంపాదిస్తున్నారు. తాజాగా ఓ చికెన్ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. నితిన్ ఈ యాడ్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఇందులో నితిన్ కూల్ అండ్ స్టైలిష్ గెటప్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ యాడ్ హైదరాబాద్ కి చెందిన స్నేహ చికెన్ బ్రాండ్ కోసం. ఈ కమర్షియల్ యాడ్ ని ‘స్నేహ చికెన్ – ది చికెన్ ఆంథమ్’ అనే పేరుతో రిలీజ్ చేసారు. ఈ యాడ్ లో హీరో నితిన్ కి తల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కనపడింది. ”ఈ అమ్మలు ఎప్పుడూ ఇంతేనండి. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రశ్నకు స్నేహ ఫ్రెష్ చికెన్ సమాధానమయితే ప్రతి అమ్మకి ఇక పండగే” అని నితిన్ ప్రమోట్ చేస్తున్నాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి కో రైటర్ గా అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనిల్ కుమార్ ఉపాధ్యాయుల ఈ కమర్షియల్ యాడ్ ను తీశారు. ఇందులో నితిన్ అడుగుతున్న ‘తిన్నావా?’ అనే ప్రశ్న అందరినీ ఆకర్శించడంతో పాటు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతొంది. ఇది నితిన్ కి మొట్టమొదటి కార్పొరేట్ బ్రాండ్ ఎండార్స్మెంట్ కావడం విశేషం. నితిన్ లవ్ లీ పెరఫార్మన్స్ కి అనిల్ కుమార్ డైరెక్షన్ తోడై ఇలాంటి అద్భుతమైన యాడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా స్నేహ చికెన్ సీఈఓ వరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. మరో ప్రక్క నితిన్ హీరోగా కథని రెడీ చేసుకుని అనిల్ కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా త్వరలో ఎనౌన్సమెంట్ అయ్యే అవకాసం ఉందని సమాచారం. ఈ యాడ్ తీసేటప్పుడు అనీల్ ప్రతిభ చూసిన నితిన్ ఇంప్రెస్ అయ్యి ఈ అవకాసం ఇస్తున్నారంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇక నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది.
పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.