నితిన్, వెంకీ కుడుముల చిత్రానికి ఎవ్వరూ ఊహించని యాక్షన్ టైటిల్..

Published : Jan 25, 2024, 01:18 PM IST
నితిన్, వెంకీ కుడుముల చిత్రానికి ఎవ్వరూ ఊహించని యాక్షన్ టైటిల్..

సారాంశం

యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది ఎలాగైనా ఒక హిట్ కావాలి. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్ పడి చాలా కాలమే అవుతోంది. ఇప్పుడు హిట్ కోసం మరోసారి నితిన్ భీష్మ డైరెక్టర్ నే నమ్ముకున్నాడు.

యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది ఎలాగైనా ఒక హిట్ కావాలి. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్ పడి చాలా కాలమే అవుతోంది. ఇప్పుడు హిట్ కోసం మరోసారి నితిన్ భీష్మ డైరెక్టర్ నే నమ్ముకున్నాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రెండో చిత్రం తెరకెక్కుతోంది. 

మైత్రి మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. ముందుగా ఈ చిత్రానికి రష్మిక మందనని ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. సింపుల్ కథతో ఫన్ ఎలిమెంట్స్ తో వెంకీ కుడుముల భీష్మ చిత్రాన్ని హిట్ మూవీగా మలిచారు. ఈసారి బలమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. 

నితిన్ చివరగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ చిత్రం డిసెంబర్ లో రిలీజై తీవ్రంగా నిరాశపరిచింది. అంతకు ముందు మాచర్ల నియోజకవర్గం చిత్రం కూడా డిజాస్టర్. దీనితో వెంకీ కుడుముల చిత్రంపైనే నితిన్ ఆశలన్నీ ఉన్నాయి. తాజా సమాచారం మేరకు నితిన్ , వెంకీ కుడుముల చిత్రాన్ని అదిరిపోయే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదికూడా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన యాక్షన్ టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే 'రాబిన్ హుడ్'. 

దీనితో ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.నితిన్ ఇలియానా జంటగా నటించిన రెచ్చిపో చిత్రం హిందీలో ఆజ్ కా రాబిన్ హుద్ అనే టైటిల్ తో డబ్ అయింది. ఇప్పుడు రాబిన్ హుడ్ అనేది నితిన్ చిత్రానికి అసలైన టైటిల్ గా మారుతోంది. మరోవైపు నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?