రీసెంట్ గా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అయినా సరే ఈ వీడియోలు ఆగడంలేదు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది డీప్‌ఫేక్ వీడియోస్ వివాదం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా సృష్టించింది ఈ విషయం. స్టార్ సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా హీరోయిన్ల ఫేస్ లు, బాడీలు మార్చేసి.. హాట్ గా.. వల్గర్ గా క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సైబర్ నేరగాలు. ఇక ఈ డీప్‌ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు కేంద్రం ఓ వైపు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. దేశంలోని టాప్ హీరోయిన్లు మాత్రం వరుసగా ఈ డీప్ ఫేక్ బాధితురాళ్లుగా మారుతున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియోతో స్టార్ట్ అయ్యింది వివాదం. రష్మిక వీడియో వైరల్ అవ్వడంతో అది సంచలనంగా మారింది. ఈ విషయంలో తన ఆవేదన వ్యక్తం చేసింది బ్యూటీ. తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. రష్మిక వారికి కృతజ్ఞతలు చేప్పారు కూడా. అయితే ఇక అప్పటి నుంచి ఎవరో ఒకరు కరు దీని బారిన పడుతూనే ఉన్నారు.
ఇప్పటికే నేషనల్ క్రష్‌గా పేరుపొందిన దక్షిణాది తార రష్మిక మందన్నా ఆమె తరువాత బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే వారితో పాటు బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా సైతం డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ఇక ఇఫ్పుడు మరోసారి కత్రీనా కైఫ్ ను ట్రార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆమె మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ మరో డీప్ ఫేక్ వీడియో వైరలవుతుంది. అందులో అస్లీలంగా ఏమీ లేకపోయినా.. ఆమెది కాని వాయిస్ ను ఆడ్ చేసి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అందులో ఆమె అనర్గళంగా టర్కిష్ మాట్లాడుతూ కనిపించింది. నిజానికి ఈ వీడియో 2014లో హృతిక్ రోషన్, కత్రినా కలిసి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఓ ఇంటర్వ్యూలోనిది.
ఈ వీడియోలో కత్రినా టర్కిష్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా యంగ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లాడిన కత్రీనా.. తన సినిమాలు తాను చేసుకుంటూ.. విక్కీతో ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది.
రీసెంట్ గా టైగర్ 3లో సల్మాన్ ఖాన్ తో కలిసి సందడి చేసింది కత్రీనా కైఫ్. ఈమధ్య భర్త విక్కీతో కలిసి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.