వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఫిబ్రవరి 13న రిలీజ్ అవ్వబోతున్న నిలవే సినిమా

Published : Jan 20, 2026, 10:36 PM IST
Nilave Movie

సారాంశం

ఈ ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా యూత్ ఆడియన్స్ కోసం అద్భుతమైన సినిమాలెన్నో రాబోతున్నాయి. అందులో నిలవే సినిమా కూడా ఒకటి. యంగ్ స్టార్స్ నటించిన ఈ సినిమా రిలీజ్ పై.. తాజాగా మూవీ టీమ్ ఓ ప్రకటన చేశారు. 

వాలెంటైన్స్ డే స్పెషల్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాతలుగా ఈసినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.

బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించగాహర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

యూత్ ఫుల్ మ్యూజికల్ లవ్ డ్రామా

ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్ రాసిన పాటలకు కోటి అదనపు లిరిక్స్ అందించారు. సత్య.జి ఎడిటింగ్‌తో సినిమా మరింత ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది.ప్రొడక్షన్ డిజైనర్స్‌గా కట్ట శివరామ కృష్ణ, జియా ఘోష్ పనిచేయగా, నూరా సయ్యద్ అదనపు ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. సహ-నిర్మాతలుగా వెంకట్కొణకండ్ల, సంజనా కృష్ణ, వ్యవహరించిన ఈ చిత్రం, కంటెంట్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొత్తంగా, కొత్తదనంతో పాటు భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన నిలవే సినిమా.. ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai : నాకంటూ ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోలేను, పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‌కు 'నువ్వు నేను' సినిమాలో ఛాన్స్.. కుండబద్దలు కొట్టిన తేజ