నిఖిల్ 'ముద్ర' టైటిల్ మారింది!

Published : Feb 04, 2019, 12:23 PM IST
నిఖిల్ 'ముద్ర' టైటిల్ మారింది!

సారాంశం

నిఖిల్ హీరోగా దర్శకుడు సంతోష్ రూపొందిస్తోన్న సినిమా 'ముద్ర' సినిమా టైటిల్ ని మార్చేశారు. దీనికి 'అర్జున్ సురవరం' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా డిసంబర్ లోనే విడుదల కావాల్సివుంది. 

కానీ ఇప్పుడు సినిమాను మార్చికి షిఫ్ట్ చేశారు. టైటిల్ కూడా మార్చేశారు. టైటిల్ మార్చడం వెనుక ఓ కారణముంది. గత కొద్దిరోజులుగా సినిమా టైటిల్ కోసం నట్టికుమార్ అలానే నిఖిల్ ల మధ్య గొడవ జరుగుతోంది. జగపతిబాబు హీరోగా రూపొందిన 'ముద్ర' అనే సినిమాను నట్టికుమార్ విడుదల చేశారు.

దీంతో సినిమా టైటిల్ విషయంలో రెండు చిత్రబృందాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఆల్రెడీ 'ముద్ర' పేరుతో సినిమా విడుదల కావడంతో ఇప్పుడు నిఖిల్ సినిమా పేరుని 'అర్జున్ సురవరం'గా మార్చేశారు.

ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. ఈ కొత్త టైటిల్ కి సంబంధించి పోస్టర్ ని విడుదల చేశారు. మర్చి 29న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే
Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్