సీఎం కొడుకు సక్సెస్ అందుకుంటాడా..?

Published : Nov 09, 2018, 10:34 AM IST
సీఎం కొడుకు సక్సెస్ అందుకుంటాడా..?

సారాంశం

సినీ నిర్మాత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఇదివరకే టాలీవుడ్ లో 'జాగ్వార్' అనే సినిమాలో నటించాడు. తెలుగులో హీరోగా పరిచయమైన ఈ సినిమా అతడికి పెద్దగా గుర్తింపుని తీసుకురాలేకపోయింది. ఆ తరువాత నిఖిల్ తెలుగు సినిమాలలో కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

సినీ నిర్మాత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఇదివరకే టాలీవుడ్ లో 'జాగ్వార్' అనే సినిమాలో నటించాడు. తెలుగులో హీరోగా పరిచయమైన ఈ సినిమా అతడికి పెద్దగా గుర్తింపుని తీసుకురాలేకపోయింది. 

ఆ తరువాత నిఖిల్ తెలుగు సినిమాలలో కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు-కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోగా నిఖిల్ గౌడని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. మోహన్ వడ్లపట్ల గతంలో మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో వంటి సినిమాలను నిర్మించారు.

ఈసారి మాత్రం భారీ బడ్జెట్ తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అమెరికా బ్యాక్ డ్రాప్ లో మరో సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే