తనకు తానే కాస్ల్టీలో గిఫ్ట్ ఇచ్చుకున్న యంగ్‌ హీరో నిఖిల్‌.. ఆ సినిమానే కారణమట..

Published : Jan 25, 2021, 12:44 PM IST
తనకు తానే కాస్ల్టీలో గిఫ్ట్ ఇచ్చుకున్న యంగ్‌ హీరో నిఖిల్‌.. ఆ సినిమానే కారణమట..

సారాంశం

యంగ్‌ హీరో నిఖిల్‌  కరోనా టైమ్‌లోనే తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు జీవితంలో మరో మెట్టు ఎదిగారు. లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. రేంజ్‌ రోవర్‌ని కొన్నాడు. `రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ` కారు విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని తెలుస్తుంది. 

యంగ్‌ హీరో నిఖిల్‌  కరోనా టైమ్‌లోనే తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు జీవితంలో మరో మెట్టు ఎదిగారు. లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. రేంజ్‌ రోవర్‌ని కొన్నాడు. `రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ` కారు విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని నిఖిల్‌ ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. అయితే ఇది తనకు తాను ఇచ్చుకున్న గిఫ్ట్ అని చెప్పారు. `అర్జున్‌ సురవరం` సక్సెస్‌ సందర్భంగా కారు కొన్నట్టు చెప్పాడు. 

`న్యూ రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ, `అర్జున్‌ సురవరం` సక్సెస్‌ సందర్భంగా నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఇది. కోవిడ్‌ వల్ల కాస్త ఆలస్యమైంది` అని పేర్కొన్నాడు నిఖిల్‌. `హ్యాపీడేస్‌` చిత్రంతో హీరోగా పరిచయం అయిన నిఖిల్‌ ఆ తర్వాత అనేక పరాజయాలు చవిచూశాడు. ఈ క్రమంలో `స్వామిరారా`, `కార్తికేయ`, `ఎక్కడికిపోతావు చిన్నవాడా` చిత్రాలతో విజయాలు అందుకున్న తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది `అర్జున్ సురవరం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనేక అడ్డంకులు ఎదుర్కొని, చిరంజీవి సపోర్ట్ తో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. 

ప్రస్తుతం నిఖిల్‌ `కార్తికేయ` సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో `కార్తికేయ- 2`లో నటిస్తున్నారు. దీంతోపాటు గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై `18 పేజెస్` చిత్రంలో నటిస్తున్నారు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?