వెడ్డింగ్ స్పెషల్: నిక్ పాటకు ప్రియాంక చిందులు!

Published : Dec 02, 2018, 02:46 PM ISTUpdated : Dec 02, 2018, 02:57 PM IST
వెడ్డింగ్ స్పెషల్: నిక్ పాటకు ప్రియాంక చిందులు!

సారాంశం

photo curtesy: vogue గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో వీరికి సంబందించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. పోటోలను ఎక్కువగా బయటకు రిలీజ్ చేయడం లేదు. మీడియాకు కూడా వెడ్డింగ్ ఫంక్షన్స్ కు ఎంట్రీ లేదు. 

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన సత్తా ఏమిటో చూపించిన ప్రియాంక చోప్రా నిన్నటితో ఒక ఇల్లాలు గా మారిపోయింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో అమ్మడు శనివారం క్రిస్టియన్ పద్దతిలో  వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నేడు హిందూ సంప్రదాయం ప్రకారం జోధ్ పుర్ లో నిక్ ను పెళ్లి చేసుకుంది. 

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో వీరికి సంబందించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. పోటోలను ఎక్కువగా బయటకు రిలీజ్ చేయడం లేదు. మీడియాకు కూడా వెడ్డింగ్ ఫంక్షన్స్ కు ఎంట్రీ లేదు. ఇక వారికి సంబందించిన ఫొటోలు వారు రిలీజ్ చేస్తేనే అభిమానులు వీక్షిస్తున్నారు. ఇక రీసెంట్ గా ప్రముఖ వోగ్ మ్యాగజిన్ నుంచి ఒక వీడియో విడుదలైంది. 

పెళ్లి సందర్బంగా నిక్ ప్రియాంక మధ్యన ఒక పాటను చిత్రీకరించారు. నిక్ స్వయంగా పాటను పడటం ఇక అందుకు తగ్గట్టుగా బెలూన్స్ మధ్యన అమ్మడు గ్లామర్ గా చిందులు వేయడం అందరిని ఆకట్టుకుంటోంది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.  

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌