
మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. ఆ మధ్యన నిహారిక ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించింది. అయితే నిహారిక ఆ పబ్ కి కేవలం పార్టీ కోసమే వెళ్లిందని.. పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ వ్యవహారం చిత్ర పరిశ్రమలో గందరగోళం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
గత కొంత కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న నిహారిక తిరిగి యాక్టివ్ గా మారింది . తాజాగా నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.. ట్విట్టర్ వేదికగా నిహారిక పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపింది.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏపీలో కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం తమ వంతుగా సాయం చేసేందుకు మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చింది. నాగబాబు కుటుంబ సభ్యులు, సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు, అలాగే పవన్ చెల్లి మాధవి..కౌలు రైతులని ఆదుకునే కార్యక్రమం కోసం ఆర్థిక సాయం అందించారు.
నాగబాబు ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ 10 లక్షలు, నిహారిక 5 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో పవన్ వారందరిని అభినందిస్తూ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి స్పందిస్తూ నిహారిక ట్వీట్ చేసింది.
ప్రజల భవిష్యత్తు కోసం, వారిని అందుకునేందుకు నీవు చేస్తున్న గొప్ప పనిలో చిన్న భాగం అయినందుకు.. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ కళ్యాణ్ బాబాయ్. ప్రజలకు మెరుగైన బాట వేయాలంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యం అని నిహారిక ట్వీట్ చేసింది.