మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న సినిమాకు హీరోయిన్ దొరికింది, ఎవరంటే?

Published : Jun 27, 2025, 07:31 AM IST
Niharika Konidela confirms Nayan Sarika as heroine in her next film

సారాంశం

నిహారిక కొణిదెల నిర్మాతగా మరో సినిమా రాబోతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మెగా డాటర్ నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. .

 

2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. దానితో పాటు ఈమూవీ డైరెక్టర్ యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో ఇప్పుడు రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దానికి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై, మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్నా రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ డైనమిక్ హీరో సంగీత్ శోభన్ ఈ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు.

ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తుంది. ఆయ్, క వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 వారి హలో వరల్డ్, సోనీ లివ్ వారి బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు.నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?