వీడియో: చిరు సాంగ్ కు నిహారిక,చైతన్య డాన్స్

Surya Prakash   | Asianet News
Published : Dec 08, 2020, 12:28 PM ISTUpdated : Dec 08, 2020, 12:31 PM IST
వీడియో: చిరు సాంగ్ కు నిహారిక,చైతన్య డాన్స్

సారాంశం

మరి కొద్ది గంటల్లో వివాహ బంధంతో ఒక్కటికాబోతున్న నిహారిక-చైతన్యలు మెగాస్టార్‌ చిరంజీవి పాటకు ఉషారుగా డాన్స్ చేసారు.  చిరు నటించిన చిత్రం ‘బావగారూ.. బాగున్నారా!’ చిత్రంలోని ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’ పాటకు ఈ జంట వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిహారిక చాలా ఉత్సాహంగా అనేక పాటలకు డ్యాన్స్‌ చేశారు. 

డిసెంబరు 9న గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యను నిహారిక మనువాడబోతున్న సంగతి తెలిసిందే. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు శుభకార్యం జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌ విలాస్‌ ఈ వేడుకకు వేదికైంది. ఇప్పటికే వధూవరులు, వారి తల్లిదండ్రులు, వరుణ్‌ తేజ్‌, అల్లు అర్జున్, అరవింద్, చిరంజీవి, కల్యాణ్‌ దేవ్‌, శ్రీజ, సుస్మిత తదితరులు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు సంగీత్‌ కార్యక్రమంలో ఊత్సాహంగా పాల్గొన్నారు. 

మరి కొద్ది గంటల్లో వివాహ బంధంతో ఒక్కటికాబోతున్న నిహారిక-చైతన్యలు మెగాస్టార్‌ చిరంజీవి పాటకు ఉషారుగా డాన్స్ చేసారు.  చిరు నటించిన చిత్రం ‘బావగారూ.. బాగున్నారా!’ చిత్రంలోని ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’ పాటకు ఈ జంట వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిహారిక చాలా ఉత్సాహంగా అనేక పాటలకు డ్యాన్స్‌ చేశారు. 

 ఉదయ్‌పూర్‌ లో అడుగుపెట్టిన వధూవరులు ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అదేవిధంగా కల్యాణ్‌ దేవ్‌ తీసిన ఫొటోలంటూ ఉపాసన కొన్ని స్టిల్స్‌ షేర్‌ చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే