ఆ బూతులతో తిట్టేస్తా.. నీహారిక ఘాటు వ్యాఖ్యలు!

Published : Mar 30, 2019, 05:03 PM IST
ఆ బూతులతో తిట్టేస్తా.. నీహారిక ఘాటు వ్యాఖ్యలు!

సారాంశం

మెగా డాటర్ నీహారిక కొణిదెల నటించిన 'సూర్యకాంతం' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి ఈ సినిమా మిశ్రమ స్పందన లభిస్తోంది.

మెగా డాటర్ నీహారిక కొణిదెల నటించిన 'సూర్యకాంతం' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి ఈ సినిమా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నీహారిక చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి ఆమె వద్ద ప్రస్తావించగా.. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దానికి కారణం వాళ్ల వస్త్రధారణ అనే వాళ్లను చూస్తే కోపం వస్తుందని చెప్పింది. అమ్మాయిలు చీరలు కట్టుకోకుండా పొట్టి డ్రెస్ లు వేసుకుంటే రేప్ లు జరుగుతున్నాయంటూ పిచ్చిగా వాదించడం కరెక్ట్ కాదని చెప్పింది.

వాళ్లకు నచ్చినట్లు ఉంటే అందులో తప్పేముందని ప్రశ్నించింది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉంటారని చెప్పింది. ఇలా ఉండాలని అమ్మాయిలకు రూల్స్ పెట్టడాన్ని తప్పుబట్టింది. 

''ఎవరైనా వచ్చి తనను తాకరాని చోట తాకితే.. ఏవండీ వెధవ గారు అలా చేయకూదదండి అని అనను కదా.. నాకు తెలిసిన అతి పెద్ద బూతు తిడతాను'' అంటూ చెప్పింది. ఇంకా కోపం వస్తే కొడతానని.. అంతేతప్ప నాకెందుకులే అని వదలనని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?