
యూత్ స్టార్ నితిన్ గేర్ మార్చాడు. కథా చిత్రాలకు గుడ్ బై చెప్పి వైవిధ్యం ఉన్న కథలకు, యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. చెక్ మూవీతో డిఫెరెంట్ అటెంప్ట్ చేసిన నితిన్ కు సరైన ఫలితం దక్కలేదు. ఇక శుక్రవారమే మాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇటీవల నితిన్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర లాంచింగ్ రోజునే హై ఓల్టేజ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'మాచర్ల నియోజకవర్గం' అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు.
నితిన్ సోదరి నిఖితా రెడ్డి, తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ కి జోడిగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్ గా కూడా చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ గా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.
యాక్షన్ అంశాలతో రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నిధి అగర్వాల్ టాలీవుడ్ కుర్రకారు హృదయాల్ని దోచుకుంటున్న భామ. గ్లామర్ తో అందరిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిత్రంలో నటిస్తోంది. మాచర్ల నియోజకవర్గం చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు.