స్టార్ హీరోతో డేటింగ్ ? పర్సనల్ లైఫ్ పై హరిహర వీరమల్లు హీరోయిన్ సమాధానం ఇదే

Published : Jun 02, 2025, 06:12 PM IST
Nidhhi Agerwal

సారాంశం

హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ తో నిధి అగర్వాల్ బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ గురించి నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.

జూన్ 12న హరిహర వీరమల్లు 

ప్రస్తుతం నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ యాక్షన్ పీరియడ్ డ్రామా చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిధి, పంచమీ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు నిధి అగర్వాల్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్ర రిలీజ్ కి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో నిధి అగర్వాల్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

మూడేళ్ళ తర్వాత థియేటర్స్ లో సందడి చేయబోతున్న నిధి అగర్వాల్ 

2022లో వచ్చిన హీరో చిత్రం తర్వాత నిధి అగర్వాల్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. మూడేళ్ళ తర్వాత ఆమె నటించిన చిత్రం థియేటర్స్ లోకి వస్తోంది. ఐదేళ్లుగా హరి హర వీరమల్లు చిత్రం వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. మరోవైపు నిధి అగర్వాల్ నటిస్తున్న ప్రభాస్ రాజా సాబ్ కూడా చాలా కాలంగా వాయిదా పడుతోంది. 

ఇక ఇదిలా ఉండగా, నిధి గతంలో తమిళ సినిమాల్లో నటించింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు రూమర్లు వెలువడ్డాయి. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో శింబుతో ఆమె రిలేషన్ షిప్ లో ఉందని, డేటింగ్ చేస్తోందని సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

స్టార్ హీరోతో డేటింగ్, నిధి అగర్వాల్ ఆన్సర్ ఇదే 

ఈ విషయం గురించి నిధిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ రూమర్స్ అవాస్తవం అని అన్నారు. “రూమర్లు సెలబ్రిటీల జీవితంలో భాగం. అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. నేను వాటిని సీరియస్‌గా తీసుకోను,” అని తెలిపారు. అయితే, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. “నా వ్యక్తిగత విషయాలను నేను ప్రైవేట్‌గా ఉంచుకుంటాను,” అని అన్నారు.

ఇక శింబు విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ అనే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.

ప్రస్తుతం తన ఫోకస్ సినిమాలపైనే ఉందని చెప్పిన నిధి అగర్వాల్.. పర్సనల్ లైఫ్ గురించి బయట మాట్లాడానని తేల్చేశారు.  

నిధి అగర్వాల్ చిత్రాలు 

గతంలో ఆమె టాలీవుడ్ లో కొన్ని నటించారు. 2018లో విడుదలైన సవ్యసాచి చిత్రంలో నాగచైతన్య సరసన నటించారు. ఆ తర్వాత నాగ చైతన్య బ్రదర్ అఖిల్ కి జోడిగా మిస్టర్ మజ్ను చిత్రంలో నటించారు. అలాగే, 2019లోనే విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ పోతినేనితో కలిసి నటించి మంచి క్రేజ్ సంపాదించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2022లో విడుదలైన హీరో చిత్రంలో అశోక్ గల్లా సరసన నటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటించే అవకాశాన్ని నిధి అగర్వాల్ అందుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?