OG షూటింగ్ కు బ్రేక్, ఏపీకి పవన్ కళ్యాణ్, కారణం ఏంటో తెలుసా?

Published : Jun 02, 2025, 06:05 PM IST
Pawan Kalyan OG

సారాంశం

ముంబయ్ లో జరుగుతున్న ఓజీ షూటింగ్ కు సడెన్ గా బ్రేక్ ఎందుకు పడింది. పవన్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వకుండానే ఏపీకి తిరిగి ఎందుకు వచ్చారు. ముంబయ్ లో అసలు ఏం జరిగిందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటినీ బాలన్స్ చేస్తూ.. కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా వాయిదా పడిన సినిమాల పనులు ప్రస్తుతం స్పీడ్ గా పూర్తి చేస్తున్నాడు పవర్ స్టార్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్, ప్రస్తుతం 'OG' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో జరిగింది. పగలు, రాత్రి తేడా లేకుండా జరిపిన ఈ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పూర్తి ఎనర్జీతో పాల్గొన్నారు. ఇటీవల OG మూవీలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని లుక్‌లు ముంబైలో నుంచి లీక్ కావడం, వాటిపై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే.

తాజాగా ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్, ఏపీకి తిరిగొచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఈ షూటింగ్‌లో పాల్గొనాల్సిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ సోకినట్టు సమాచారం. ఈ కారణంగా ఆయన షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ – ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ సన్నివేశాల కోసం ఇమ్రాన్ హష్మీ తిరిగి వస్తే తదుపరి షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

OG సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం OG సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా పవన్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తికాగానే ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు టీమ్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం