
నేషనల్ క్రష్ నిధి అగర్వాల్(Nidhhi Agarwal) పవన్ కళ్యాణ్‌పై స్పందించింది. ఆయనతో సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాతో తన డ్రీమ్ నెరవేరిందని చెప్పింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న `హీరో` చిత్రంలో కథానాయికగా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సందడి చేస్తుంది నిధి అగర్వాల్.
ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. పవన్‌తో నిధి `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి `పంచమి` పాత్రలో నటిస్తుంది. కెరీర్ బిగినింగ్‌లోనే పవన్‌తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది నిధి. తాజాగా `హీరో` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె స్పందిస్తూ `హరిహర వీరమల్లు` చిత్రం గురించిన అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది యాభై శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని తెలిపింది.
పీరియాడికల్ యాక్షన్‌గా ఈ సినిమా రూపొందుతుందని చెప్పిన నిధి.. ఇందులో తాను యాక్షన్ కూడా చేసిందట. Pawan Kalyanవంటి పెద్ద స్టార్‌తో కలిసి నటించాలని, యాక్షన్ చిత్రాలు చేయాలనే కోరిక ఉందని, ఈ రెండు ఒకే సినిమాతో తీరడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఇందులో తన పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిపింది. నటిగా తనకు నెక్ట్స్ లెవల్ సినిమా అవుతుందని చెప్పింది. కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని చెప్పొంది. అయితే పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని పేర్కొందీ సౌత్ నేషనల్ క్రష్. `హీరో` చిత్రంలో తాను డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు చెప్పింది. అశోక్ గల్లా హీరోగా చాలా బాగా చేశాడని, కచ్చితంగా హిట్ మూవీ అవుతుందని తెలిపింది.
ఇదిలా ఉంటే నిధి అగర్వాల్‌కి యూత్‌లో యమ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. `ఇస్మార్ట్ శంకర్` చిత్రంలో ఆమె చేసిన మాయ అంతా ఇంతా కాదు. దీంతో భారీ ఫాలోయింగ్‌ని పంచుకుంది. మరోవైపు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియా అభిమానులను పెంచుకుంటోంది నిధి. ప్రస్తుతం సౌత్ అత్యంత క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తుంది. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది. ప్రస్తుతం నిధి `హీరో`, `హరిహరవీరమల్లు`తోపాటు తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇందులో ఆమె రియలిస్టిక్ రోల్ చేస్తుందట. మేకప్ లేకుండా కనిపించబోతుందట.