విజయ్ దళపతి గ్యారేజ్ లో మరో లగ్జరీ కార్.. ఖరీదు తెలిస్తే..కళ్లు తిరగాల్సిందే...?

By Mahesh Jujjuri  |  First Published Jan 25, 2024, 1:22 PM IST

సెలబ్రిటీలకు కార్లు కొంటం పెద్ద విషయమేమి కాదు. కోట్లె సంపాదిస్తున్న హీరోల గ్యారేజుల్లో కోట్లు విలువ చేసే కార్లు ఉండటం సహజం. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చి చేరిందట. 
 


సౌత్ మార్కెట్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళంలో రజినీకాంత్ తరువాత  విజయ్ సెకండ్ ప్లేస్ లో  ఉన్నారు. వరుసగాసినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో.. త్వరలో రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. ఇక విజయ్ దళపతి ఇటీవలే లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇటు తెలుగు మార్కెట్ లో కూడా ఈమూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక ఓటీటీలో రిలీజ్అయిన ఈ సినిమాకు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ లభిచింది. ఇక ఆ విషయం పక్కనపెడితే..తాజాగా విజయ్ దళపతి గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే.. దళపతి ఓ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడట. అది కూడా కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. BMW i7 x Drive 60 లగ్జరీ కారును తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని రేటు దాదాపు 2.50 కోట్లు  ఉంటుందని తెలుస్తోంది. పూర్తి ఎలక్ట్రిక్ కారు కావడంతో పాటు చార్జ్ అవ్వడానికి కూడా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫుల్ చార్జ్ అయితే.. దాదాపు 600 కిలో మీటర్లు మైలేజ్ ఇస్తుందట. 

Latest Videos

ఎంతో ముచ్చటపడి ఈకారును కొన్నారట విజయ్. ఇప్పటికే విజయ్ గ్యారేజ్ లో చాలా కార్లు ఉన్నాయి. అందులో సెలబ్రెటీలు ఎక్కువగా ఇష్టపడే రోల్స్ రాయిస్ కూడా ఒకటి. దీని ధర దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఇక ప్రస్తుతం విజయ్ తన  69వ  సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్  చెన్నైలో జరుగుతుంది. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు విజయ్. ఇందులో మీనాక్షి చౌదరి, మైక్ మోహన్, యోగి బాబు, ప్రభుదేవా, ప్రశాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అర్చన కళాపతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

click me!