2022 సంక్రాంతి బరిలో ఆర్ ఆర్ ఆర్?

Published : Jun 20, 2021, 11:59 AM IST
2022 సంక్రాంతి బరిలో ఆర్ ఆర్ ఆర్?

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. 2020 జులై నుండి 2021 సంక్రాంతికి... 2021 సంక్రాంతి నుండి 2021 అక్టోబర్ కి పోస్ట్ ఫోన్ చేశారు. ఈ ఆలస్యం వెనుక రాజమౌళి ప్రమేయం తక్కువ  కాగా, కరోనా ప్రమేయం ఎక్కువగా ఉంది.


ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు వస్తుందంటే మేకర్స్ దగ్గరే సమాధానం లేదు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటన రోజే 2020జులై లో విడుదల చేస్తామని రాజమౌళి తెలిపారు. రాజమౌళి అన్నాడే కానీ, ఆయన అభిమానులెవరూ నమ్మలేదు. దానికి కారణం విడుదల విషయంలో ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. టీజర్స్, ఫస్ట్ లుక్స్ కూడా చెప్పిన సమయానికి విడుదల చేయరు. గంటో, అరగంటో ఆలస్యం కావాల్సిందే. 


ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. 2020 జులై నుండి 2021 సంక్రాంతికి... 2021 సంక్రాంతి నుండి 2021 అక్టోబర్ కి పోస్ట్ ఫోన్ చేశారు. ఈ ఆలస్యం వెనుక రాజమౌళి ప్రమేయం తక్కువ  కాగా, కరోనా ప్రమేయం ఎక్కువగా ఉంది. రాజమౌళి కుమారుడి పెళ్లి, ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ కి దెబ్బలు తగలడం వలన మొదట్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్నట్లుగా సాగలేదు. 


ఇక ఊహించని విధంగా దాడిచేసిన కరోనా ఆర్ ఆర్ ఆర్ విడుదలపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు సార్లు దాదాపు ఏడాది సమయం కరోనా లాక్ డౌన్స్ కారణంగానే కోల్పోవాల్సి వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ షూటింగ్ కి సిద్ధం అయ్యారు. రేపటి నుండి హైదరాబాద్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అయితే ఆర్ ఆర్ ఆర్ విడుదల 2022 సంక్రాంతికి షిఫ్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే