'నీట్' పరీక్షా విధానం పై వ్యతిరేకత వ్యక్తం చేసిన హీరో సూర్య!

By team teluguFirst Published Jun 20, 2021, 10:07 AM IST
Highlights

నీట్ పరీక్షా విధానంపై నటుడు సూర్య తన అభిప్రాయం తెలియజేశారు. తమిళనాడు రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసేదిగా నీట్ పరీక్షా విధానం ఉందని సూర్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సామాజిక స్పృహ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఎవరు ఏమనుకున్నా అన్యాయం అనుకుంటే ప్రశ్నించడం ఆయన నైజం. విద్యా విధానంలో అనేక లోపాలు ఉండగా నీట్ పరీక్షపై చర్చ కొనసాగుతుంది. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్‌ ప్రవేశ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై అభిప్రాయ సేకరణ కోసం ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఏకే రాజన్‌ సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విద్యావేత్తలు, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.


కాగా నీట్ పరీక్షా విధానంపై నటుడు సూర్య తన అభిప్రాయం తెలియజేశారు. తమిళనాడు రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసేదిగా నీట్ పరీక్షా విధానం ఉందని సూర్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమాజంలో పేద, ధనిక అనే రెండు వర్గాలకు వేర్వేరు విద్యావిధానాలు అమలవుతున్న తరుణంలో విద్యార్థుల అర్హతను నిర్ణయించేందుకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయడం ఏమేరకు సమంజసమని హీరో సూర్య ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అగరం ఫౌండేషన్‌ పేరుతో విద్యా సంస్థను నడుపుతున్న హీరో సూర్య కూడా తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారు. ప్రజలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను కమిటీకి తెలియజేయాలని కోరుతున్నారు. 


మరోవైపు సురారై పోట్రు మూవీతో సూర్య భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సురారై పోట్రు హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సూర్య పాండి రాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం, జ్ఞానవేల్ దర్శకతంలో మరొక చిత్రం చేస్తున్నారు. 

click me!