కంగనా రనౌత్ ఎంపికపై విమర్శలు.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్

Published : Mar 22, 2021, 07:05 PM IST
కంగనా రనౌత్ ఎంపికపై విమర్శలు.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్

సారాంశం

జాతీయ ఉత్తమ నటి అవార్డుకు కంగనాను ఎంపిక చేయడం కొన్ని విమర్శలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో కంగనాను నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ అండతో కంగనా ఈ అవార్డు దక్కించుకున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నిజమైన అర్హులను కాకుండా ప్రలోభాలకు లోబడి, కంగనాను ఎంపిక చేశారని సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. 

నేడు కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. 2019 సంవత్సరానికి గాను ఉత్తమ నటి, నటుడు విభాగాలతో పాటు అనేక విభాగాలకు సంబంధించిన అవార్డులు గెలుచుకున్న స్టార్స్, చిత్రాలను ప్రకటించారు. ఇక తమిళ నటుడు ధనుష్ మరియు మనోజ్ బాజ్ పేయ్ సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డ్ గెలుపొందారు. అసురన్ చిత్రంలో నటనకు గాను ధనుష్ ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపిక కాగా, భోస్లే చిత్రంలోని నటనకు మనోజ్ బాజ్ పేయ్ ని ఎంపిక చేశారు. 


ఇక ఉత్తమ నటి విభాగంలో హీరోయిన్ కంగనా రనౌత్ ని అవార్డు వరించింది. కంగనా నటించిన మణికర్ణిక చిత్రంలోని నటనకు ఆమెకు ఉత్తమ నటి అవార్డుకు ఎంపిక చేశారు. జాతీయ ఉత్తమనటి అవార్డు రెండు సార్లు గెలుచుకున్న కంగనాకు ఇది మూడవది. ఉత్తమ సహాయ నటి విభాగంలో కూడా కంగనా గతంలో ఓ అవార్డు గెలుపొందారు. దీనితో కలిసి మొత్తం నాలుగు నేషనల్ అవార్డ్స్ ఆమె పొందినట్లు అయ్యింది. 


అయితే జాతీయ ఉత్తమ నటి అవార్డుకు కంగనాను ఎంపిక చేయడం కొన్ని విమర్శలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో కంగనాను నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ అండతో కంగనా ఈ అవార్డు దక్కించుకున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నిజమైన అర్హులను కాకుండా ప్రలోభాలకు లోబడి, కంగనాను ఎంపిక చేశారని సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు కంగనాను సపోర్ట్ చేస్తూ.. అలియాతో పాటు మరికొందరు నటులను ట్రోల్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?