నేషనల్ అవార్డ్స్ 2019: ఉత్తమ నటుడు ధనుష్, నటి కంగనా రనౌత్

By team teluguFirst Published Mar 22, 2021, 5:09 PM IST
Highlights

2019 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం జాతీయ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. అందరూ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డ్స్ ధనుష్, కంగనా రనౌత్ గెలుపొందారు.

2019 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం జాతీయ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. అందరూ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డ్స్ ధనుష్, కంగనా రనౌత్ గెలుపొందారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన అసురన్ చిత్రంలో నటనకు గాను ధనుష్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు. జాతి వివక్ష అనే సామాజిక అంశం ఆధారంగా తెరకెక్కిన అసురన్ మూవీలో యువకుడిగా, మధ్య వయస్కుడైన తండ్రిగా ధనుష్, అద్భుత నటన కనబరిచారు. గతంలో ఆడుకాలం చిత్రానికి ధనుష్ నేషనల్ అవార్డు గెలుపొంచారు. 

అయితే ఈ అవార్డు హిందీ నటుడు మనోజ్ బజ్ పేయ్ తో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నాడు ధనుష్. బోన్స్లే చిత్రంలోని మనోజ్ నటనకు గాను, ఆయనను కూడా ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం జరిగింది. 

ఇక ఉత్తమ నటి అవార్డును మరోమారు కంగనా గెలుచుకున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా మణికర్ణిక చిత్రంలోని నటనకు ఉత్తమ నటి అవార్డు కంగనా పొందడం జరిగింది. స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవితగాథగా మణికర్ణిక తెరకెక్కింది. మొదట ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు క్రిష్.. ప్రాజెక్ట్ నుండి మధ్యలో తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు కూడా కంగనా తీసుకున్నారు


ఝాన్సీగా కంగనా వీరోచిన నటన కనబరచగా నాలుగవసారి ఆమెను జాతీయ అవార్డు వరించింది. గతంలో తను వెడ్స్ మను, క్వీన్స్ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు అందుకున్న కంగనా... ఫ్యాషన్ చిత్రానికి ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుపొందారు. 

click me!