హీరోయిన్ బికినీ స్టిల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

By Udayavani DhuliFirst Published 20, Jan 2019, 3:07 PM IST
Highlights

సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెడితే వాటిని చూసి ఎంజాయ్ చేసే నెటిజన్లు ఓ హీరోయిన్ బికినీ స్టిల్ పెట్టిందని తిట్టిపోస్తున్నారు. దానికి కారణం సదరు హీరోయిన్ తెలుగమ్మాయి కావడమే.. 

సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెడితే వాటిని చూసి ఎంజాయ్ చేసే నెటిజన్లు ఓ హీరోయిన్ బికినీ స్టిల్ పెట్టిందని తిట్టిపోస్తున్నారు. దానికి కారణం సదరు హీరోయిన్ తెలుగమ్మాయి కావడమే..

'గూఢచారి' చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన శోభిత ధూళిపాల సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఆమె బీచ్ లో వెనుక నుండి తీసుకున్న ఓ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

దీంతో ఓ వర్గం వారు ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. తెలుగమ్మాయివి అయి ఉండి ఇలాంటి ఫోటోలు తీసుకోవడం, ఎక్స్ పోజింగ్ సిగ్గుగా లేదా అంటూ ఆమెని తిట్టిపోస్తున్నారు. ఇప్పటివరకు హీరోయిన్లుగా వచ్చిన తెలుగమ్మాయిలు ఈ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేయకపోవడంతో శోభితపై విరుచుకుపడుతున్నారు. 

తెలుగమ్మాయిలు గ్లామరస్ గా ఉండరని అందుకే అవకాశాలు రావని కామెంట్స్ చేస్తున్న తరుణంలో శోభిత వాటిని దూరం పెట్టాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఎక్స్ పోజ్ చేస్తున్నా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో కొన్ని సినిమాలతో పాటు మూడు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. 

Last Updated 20, Jan 2019, 3:07 PM IST