ఆరోజు తమన్ ప్రశ్నించాడు.. ఈరోజు దేవిని ఆడుకుంటున్నారు!

Published : May 11, 2019, 03:42 PM IST
ఆరోజు తమన్ ప్రశ్నించాడు.. ఈరోజు దేవిని ఆడుకుంటున్నారు!

సారాంశం

టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్, తమన్ లు ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్నారు.

టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్, తమన్ లు ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్నారు. అయితే గతంలో తమన్ పై వచ్చినన్నీ విమర్శలు మరే సంగీత దర్శకుడిపై వచ్చి ఉండవు. తమన్ అందిస్తోన్న పాటలన్నీ ఒకే విధంగా ఉండడంతో సోషల్ మీడియాలో ఆయన్ని బాగా ట్రోల్ చేశారు.

తన ట్యూన్స్ తనే కాపీ చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదురయ్యాయి. ఆ సమయంలో అతడు చాలా ఫీల్ అయ్యాడు. తాను నెమ్మదస్తుడిని కాబట్టి అందరికీ టార్గెట్ అయిపోయాయని, తన స్థానంలో దేవిశ్రీప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే ట్రోల్ చేయగలరా..? అంటూ ప్రశ్నించాడు. 

ఆరోజు బాధలో తనకు తెలియకుండానే దేవిని సీన్ లోకి లాక్కొచ్చాడు తమన్. అతడు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో కానీ దానికి తగ్గట్లే ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ని ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు దేవిశ్రీని ఒక మాట అనాలంటే ఆలోచించే జనం ఇప్పుడు అతడిపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు.

తన ఆల్బం కనీసం ఒకట్రెండు పాటలకు గుర్తుండిపోయే ట్యూన్స్ ఇచ్చే దేవి ఈ మధ్యకాలంలో అది కూడా చేయలేకపోతున్నాడు. 'మహర్షి' ఆల్బం లో ఒక్క పాట కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయింది. దీంతో దేవిపై మీమ్స్ చేస్తూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి తమన్ అన్న మాట ఈరోజు నిజమైంది.  

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌