ప్రమోషన్స్ లో అతి.. అడ్డంగా బుక్కైన విజయ్ దేవరకొండ!

By AN TeluguFirst Published May 11, 2019, 3:06 PM IST
Highlights

విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతోంది. 

విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతోంది. అభిమానుల్లో అతడికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ అతడిని ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటూ బ్రహ్మరథం పడుతున్నారు. మిగిలిన హీరోలతో పోలిస్తే దేవరకొండ యాటిట్యూడ్, మాటలు భిన్నంగా ఉండడంతో జనాలు కూడా ఆయన వైపు ఆకర్షితులవుతున్నారు.

ఇప్పుడున్న హీరోల్లో ఎవరికీ కూడా దేవరకొండకి తెలిసినన్ని ట్రిక్స్ తెలియవేమో.. ప్రమోషన్స్ లో సరికొత్త స్ట్రాటజీలు ఫాలో అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఒక్కోసారి అతిగా ప్రమోషన్స్ చేసుకోవడం కూడా మంచిది కాదనే చెప్పాలి. తాజాగా ఈ హీరో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో ఐస్ క్రీమ్ లను ఉచితంగా పంచే కార్యక్రమం ఏర్పాటు చేశాడు.

దీని కారణంగా అతడికి మంచి పేరు రావడంతో పాటు తన సినిమా ప్రమోషన్స్ కి కూడా బాగా ఉపయోగపడింది. అయితే ఈ ఆలోచన గురించి మీడియాతో మాట్లాడే క్రమంలో విజయ్ దేవరకొండ.. చిన్నప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా స్కూల్ లో పిల్లలందరికీ చాక్లెట్స్ పంచుతుంటే చాలా హ్యాపీగా ఉండేదనిచెప్పాడు. ఇక్కడే పాపం మన హీరో సోషల్ మీడియా జనాలకు దొరికిపోయాడు. 

మే నెలలో పిల్లలకు సెలవులు ఉంటాయి. ఏ స్కూల్ కూడా ఓపెన్ గా ఉండదు. విజయ్ చదివింది పుట్టపర్తిలో.. అక్కడ కూడా సెలవులిస్తారు. మేలో పుట్టిన ఎవరూ కూడా స్కూల్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేరు. కానీ మన హీరో మాత్రం స్కూలూ, చాక్లెట్లు అనేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఛాన్స్ వస్తే ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే నెటిజన్లు.. ఇప్పుడు దీనిపై మీమ్స్ తయారు చేసి దేవరకొండని కామెడీ చేస్తున్నారు. 

click me!