Fighter Teaser : ‘ఫైటర్’ టీజర్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్ గా డేట్, టైమ్ అనౌన్స్ చేసిన టీమ్.. వీడియో

Published : Dec 07, 2023, 01:38 PM IST
Fighter  Teaser : ‘ఫైటర్’ టీజర్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్ గా డేట్, టైమ్ అనౌన్స్ చేసిన టీమ్.. వీడియో

సారాంశం

హృతిక్ రోషన్ - దీపికా పదుకొణె కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ Fighter. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా టీజర్ రిలీజ్ కు సిద్ధమైంది టీమ్. డేట్, టైమ్ ఫిక్స్ చేసి అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

బాలీవుడ్ గ్రీక్ గాడ్, యాక్షన్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)  మరో యాక్షన్ ఫిల్మ్ తో రాబోతున్నారు. చివరిగా ‘వార్’, ‘విక్రమ్ వేదా’ వంటి భారీ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం యాక్షన్ కు కేరాఫ్ గా మారిన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’  (Fighter)తో హృతిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను యూనిట్  జోరుగా నిర్వహిస్తోంది. 

ఈ చిత్రంలో హృతిక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)  నటిస్తోంది. ఇప్పటికే వీరద్దరి ఫస్ట్ లుక్,  క్యారెక్టర్ కు సంబంధించిన డిటేయిల్స్ ను యూనిట్ వెల్లడించారు. ఇక తాజాగా మరో బిగ్ అప్డేట్ కు యూనిట్ సిద్ధమైంది. Fighter Teaserను విడుదలకు సిద్ధం చేసినట్టు తాజాగా అఫిషీయల్ అప్డేట్ అందించారు. ఇంట్రెస్టింగ్ గా అనౌన్స్ మెంట్ వీడియోను పంచుకుంటూ డేట్, టైమ్ ను లాక్ చేశారు.  డిసెంబర్ 8న ఉదయం 11 :00 గంటలకు టీజర్ రాబోతుందని వెల్లడించారు. 

దీంతో హృతిక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే హృతిక్ - సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వార్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. భారీ సక్సెస్ తర్వాత మళ్లీ ‘ఫైటర్’తో రాబోతున్నారు. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) పాత్రలో హృతిక్ నటిస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మినల్ రాథోర్ గా దీపికా అలరించబోతోంది.  

ఇక గతేడాది సెప్టెంబర్ 30నే  రావాల్సిన ఈ చిత్రం ప్రొడక్షన్ వర్క్ ఆలస్యంతో వచ్చే ఏడాది వాయిదా పడింది. ఎట్టకేళలకు 2024 జనవరి 25న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఒక్కో అప్డేట్ అందిస్తూ హైప్ పెంచేస్తున్నారు. రేపటి టీజర్ పై ఉత్కంఠ నెలకొంది.  ఈ యాక్షన్ ఫిల్మ్ లో అనిల్ కపూర్ (Anil Kapoor) , కరణ్ సింగ్, అక్షయ్ ఒబేరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?