
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ‘పుష్ప’ అన్ని చోట్ల మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ ని సాధిస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. కానీ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీకి తీసుకొచ్చారు. ‘పుష్ప’ సినిమా మొన్న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.ఈ సినిమాని అమేజాన్ బాగా ప్రమోట్ చేస్తోంది. అయితే అదే సమయంలో నెట్ ప్లిక్స్ ఈ ప్రమోషన్ కు కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. ఇంతకీ అమేజాన్ ఏమంది...నెట్ ప్లిక్స్ ఏమి రిప్లై ఇచ్చిందో చూద్దాం.
తాజాగా వీకెండ్ లో మీరు చూడబోతున్న సినిమా ఏంటీ అన్నట్లుగా ట్విట్టర్ లో నెట్ ఫ్లిక్స్ ఇండియా వారు ట్వీట్ చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ కు అమెజాన్ ప్రైమ్ ఇండియా ట్విట్టర్ టీమ్ రెస్పాండ్ అయ్యి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పుష్ప సినిమాను చూసే పనిలో ఉన్నారు. కనుక ఇప్పుడు మీ సినిమాలు ఏమీ చూడక పోవచ్చు అన్నట్లుగా ట్వీట్ చేయడం జరిగింది.
అమెజాన్ ప్రైమ్ ట్వీట్ వైరల్ అవ్వడంతో మళ్లీ నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ టీమ్ స్పందించారు. మరి మేము అందరిలో ఉన్నామా...? ఊ అనమ్ కాని ఊహూ అని కూడా అనము అన్నట్లుగా పుష్ప ఐటెం సాంగ్ ను తెలుగు లో నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.ఈ రెండు దిగ్గజ ఓటీటీ లు కూడా ఇప్పుడు మన పుష్ప సినిమా గురించి ఇలా ట్వీట్స్ చేసుకోవడం చూస్తుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
‘పుష్ప’ థియేట్రికల్ వెర్షన్‌లో లేనివి కొన్ని డిజిటల్ వెర్షన్‌లో ఉన్నాయని ఓటీటీలో సినిమాను చూసిన వారంటున్నారు. ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ ఉ అంటావా.. ఊహూ అంటావా’ అనే సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే థియేట్రికల్ వెర్షన్‌లో ఈ సాంగ్ కొద్ది సేపు ఉండడంతో సినీ అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు ఈ లోటును తీర్చుతూ ఈ స్పెషల్ సాంగ్‌లో మరికొన్ని విజువల్స్‌ను యాడ్ చేశారట. అదేవిధంగా థియేట్రికల్ వెర్షన్‌లో ఉన్న కొన్ని అనవసరమైన సన్ని వేశాలను కూడా ఓటీటీలో ట్రిమ్ చేశారట. అందుకే థియేటర్లలో సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు ఉండగా.. ఇప్పుడు ఓటీటీ రన్ టైమ్ మాత్రం 2 గంటల 55 నిమిషాలే ఉందట.
డిసెంబర్17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా.. జనవరి 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పుష్ప’ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన 22వ రోజుకే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. హిందీ మినహాయించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రం హక్కులను ప్రైమ్ వీడియో ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందనే విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సుమారు రూ.27-30 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా పుష్ప టీమ్‌కి వస్తున్న దాని కంటే... శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే మొత్తం ఎక్కువ. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప-ది రూల్’ ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.