Pelli SandaD OTT:‘పెళ్లి సందD’ ఓటీటీ ట్విస్ట్, షాకిచ్చిన హాట్ స్టార్!

Surya Prakash   | Asianet News
Published : Jan 09, 2022, 01:03 PM IST
Pelli SandaD OTT:‘పెళ్లి సందD’ ఓటీటీ ట్విస్ట్, షాకిచ్చిన హాట్ స్టార్!

సారాంశం

రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతోపాటు ఓ కీలక పాత్ర కూడా పోషించారు.  

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన‌ చిత్రం పెళ్లి సందD. ప్ర‌ముఖ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్, యువ హీరోయిన్‌ శ్రీ‌లీల జంట‌గా న‌టించారు. గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లుద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న థియేట‌ర్ల‌లో రిలీజైందీ చిత్రం.  రివ్యూలలో డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ కొట్టింది. పాటలు పెద్ద హిట్ అయ్యాయి. హీరోయిన్ కు మంచి క్రేజ్ వచ్చి వరస సినిమాలు బుక్కైంది.

 ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం.  దాంతో థియోటర్ లో చూడనివారు ఎప్పుడు ఓటీటిలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓటీటీలో సంద‌డి చేయ‌బోతోంది..ఫలానా డేట్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు.  Disney+ Hotstar ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కాబోతోంది అన్నారు. ఆ మేరకు ప్రకటన కూడా రాలేదు. అసలు ఏం జరిగింది..ఇంత కాలం ఓటిటి లేటేంటి? అసలు ఏమైంది?

 Disney+ Hotstar వారు ఈ సినిమా రైట్స్ అసలు తమ దగ్గర లేవు అని కన్ఫర్మ్ చెప్తున్నారు. మరి ఎవరి దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. ఎప్పుడు క్లారిటీ వస్తుంది..ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయం తెలియటం లేదు. అయితే ఓటిటి బిజినెస్ విషయంలో జరిగిన కొన్ని ఇబ్బందులతోనే స్ట్రీమింగ్ అగిందని చెప్తున్నారు. అసలు ఏమి జరిగింది మాత్రం బయిటకు రాలేదు.
 
ఆర్కా మీడియా సంస్థ‌తో క‌లిసి ఆర్కే ఫిలింస్ నిర్మాణ సంస్థ పెళ్లి సందడి సినిమా నిర్మించాయి. ఈ సినిమాతోనే ద‌ర్శ‌కేంద్రుడు కే. రాఘ‌వేంద్ర‌ర‌రావు తొలిసారిగా న‌టుడిగా అవ‌తారం ఎత్తాడు. కానీ ఈ సినిమాకు తొలి రోజే నెగెటివ్ టాక్ వ‌చ్చింది. కానీ హీరోయిన్ శ్రీలీల‌కి మాత్రం మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. పెళ్లి సంద‌డిలో పిల్ల సంద‌డే ఎక్కువ‌గా ఉంద‌నే రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లంతా ఆమె వెనుక క్యూ క‌డుతున్నారు . పాటల చిత్రీకరణలో మాత్రం రాఘవేంద్ర రావు మార్క్‌ – కీరవాణి మార్క్‌ సంగీతం అలరించాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akira Nandan: నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ రియాక్షన్‌ ఇదే
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, ఎమోషనల్ కామెంట్స్