
టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరో కిరణ్ అబ్బవరం పేరు బాగా వినిపిస్తోంది. కిరణ్ అబ్బవరం యువతకు నచ్చే కథలతో దూసుకుపోతున్నాడు. కిరణ్ నటిస్తున్న చిత్రాలు పర్వాలేదనిపిస్తున్నాయి కానీ సాలిడ్ హిట్ పడడం లేదు. కిరణ్ చివరగా సమ్మతమే అనే చిత్రంలో నటించాడు. 'ఎస్ఆర్ కళ్యాణమండపం' తర్వాత మరోసారి శ్రీధర్ గాదె దర్శకత్వంలో కిరణ్ నటిస్తున్న మూవీ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'.
సెప్టెంబర్ 16న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా అలరిస్తోంది. వినోదం గ్యారెంటీ అనిపించేలా ట్రైలర్ కట్ చేశారు.
ఈ చిత్రంలో సోను ఠాకూర్, సంజన ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణ రెడ్డి ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. 'మగతనం అంటే మామూలుగా ఉన్న అమ్మాయితో మంచిగా ఉండడం కాదు.. తాగున్న అమ్మాయితో కూడానా మిస్ బిహేవ్ చేయకుండా ఉండటం' అంటూ కిరణ్ చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
కిరణ్ అబ్బవరం పంచె గెటప్ లో ఊర మాస్ గా అనిపిస్తున్నాడు. కిరణ్ మాస్ యాటిట్యూడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. హీరోయిన్ కి ఎదురైన సమస్యని పరిష్కరించే యువకుడిగా కిరణ్ నటిస్తున్నాడు. మణిశర్మ అందించిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఓవరాల్ గా నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్.. కిరణ్ అబ్బవరంకి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇది తనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని కిరణ్ సోషల్ మీడియాలో తెలిపారు.