‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్సన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సర్ ప్రైజింగ్ న్యూస్ అందించారు.
తమిళ స్టార్, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) - డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ‘జైలర్’. ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ప్రధాన భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఒక్కో రికార్డును బద్దలు కొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లు వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం అంతటా జైలర్ హవా కొనసాగుతోంది.
థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొదటి రోజు నుంచి అదే స్థాయిలో హంగామా కనిపిస్తోంది. భారీ వసూళ్లను రాబడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్ మరియు శివరాజ్‌కుమార్ కూడా నటించడం, అటు రమకృష్ణ, తమన్నా భాటియా ఉండటంతో సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళ్లింది. అలాగే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వానికి తోడు సంగీతం, యాక్షన్ అన్నీ సినిమాను అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే దిలీప్ కుమార్ ఓ గుడ్ న్యూస్ చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ... ‘జైలర్2’ కూడా ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించిన ప్లాన్స్ ఉన్నాయని తెలిపారు. అలాగే నయనతారతో తెరకెక్కించిన ‘కోలమావు కోకిల’, శివ కార్తీకేయతో తీసిన ‘డాక్టర్’, చివరిగా విజయ్ ధళపతితో వచ్చిన ‘బీస్ట్’ చిత్రాలకు కూడా సీక్వెల్స్ ప్లాన్ చేశానని అన్నారు. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ఒక్కటేనన్నారు. Vijay Thalapathy, రజినీకాంత్ మల్టీస్టారర్ గా భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని ఉందన్నారు. అందుకు తనవంతుగా కృషి చేస్తున్నానని పేర్కొన్నట్టు తెలుస్తోంది.
దీంతో వరుసగా ఫ్లాప్స్ అందుకున్న దిలీప్ కుమార్ ఇకపై బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అర్థం అవుతోంది. లేటెస్ట్ న్యూస్ తో ఆడియెన్స్ నెల్సన్ నుంచి రాబోయే సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటి వరకు కేవలం నాలుగు సినిమాలనే డైరెక్ట్ చేశారు. తక్కువ కాలంలోనే మంచి పేరును దక్కించుకుంది. ‘జైలర్’తో సాలిడ్ హిట్ అందుకున్నారు.