
అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పర్సనల్ లైఫ్ తో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అమలాపాల్ ప్రస్తుతం సింగిల్ గా ఉంటూ వస్తున్న చిత్రాలు చేస్తూ బిందాస్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అమలాపాల్ తరచుగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అమలాపాల్ మరింత బోల్డ్ గా మారింది.
అయితే తాజాగా తమిళ హీరో అథర్వ మురళి.. అమలాపాల్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అథర్వ మురళి.. వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ రాణిస్తున్నాడు.
తాజాగా అథర్వ.. డిస్ని ప్లస్ హాట్ స్టార్ కోసం తెరకెక్కిన మధకం వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ అమలాపాల్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనతో కలసి నటించిన హీరోయిన్లలో అమలాపాల్ చెత్త హీరోయిన్ అంటూ అథర్వ ఓపెన్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
నేను నటించిన రెండవ చిత్రం ముహుదుమత్ ఉన్ కర్పనై లో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. షూటింగ్ మొదలైన కొద్దీ రోజుల్లో మా మధ్య వివాదం జరిగింది. ఆ తర్వాత అది సెట్ అయింది. నువ్వొక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని అమలాపాల్ కే తాను స్వయంగా చెప్పానని అథర్వ హాట్ కామెంట్స్ చేసారు. అథర్వ ఒక క్రేజీ హీరోయిన్ గురించి ఇలా ఓపెన్ గా సంచలన వ్యాఖ్యలు చేయడంతో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.