పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నేహా ధూపియా

pratap reddy   | Asianet News
Published : Oct 04, 2021, 09:47 AM IST
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నేహా ధూపియా

సారాంశం

బాలీవుడ్ లో నేహా ధూపియా, అంగద్ బేడీ జంట క్రేజీ కపుల్స్ గా ఉన్నారు. వీరిద్దరి వివాహం సినిమాటిక్ లెవల్ లో జరిగింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు.

బాలీవుడ్ లో నేహా ధూపియా, అంగద్ బేడీ జంట క్రేజీ కపుల్స్ గా ఉన్నారు. వీరిద్దరి వివాహం సినిమాటిక్ లెవల్ లో జరిగింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. దీనితో నేహా ధూపియా పెళ్ళికి ముందే గర్భవతిగా మారింది. దీనితో వారి కుటుంబ సభ్యులు వీరిద్దరికి హడావిడిగా సీక్రెట్ మ్యారేజ్ చేశారు. 

ప్రస్తుతం అంగద్, నేహా దంపతులకు మూడేళ్ళ పాప ఉంది. కాగా నేహా ధూపియా రెండవసారి కూడా గర్భవతి అయింది. ఇటీవల ఆమె గర్భంతో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా అంగద్ బేడీ సోషల్ మీడియా వేదికగా శుభవార్త తెలియజేశాడు. 

నేహా ధూపియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించాడు.తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అంగద్ తెలిపాడు. ఇప్పుడు మేము నలుగురం అయ్యాం అంటూ అంగద్ తన సంతోషాన్ని తెలియజేశాడు. 

ఈ మేరకు అంగద్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. సెలెబ్రిటీలు, అభిమానులు అంగద్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేహా ధూపియా, అంగద్ బేడీ 2018లో వివాహం చేసుకున్నారు. 

నేహా ధూపియా టివి కార్యక్రమాలతో రాణిస్తోంది. అలాగే అంగద్ బేడీ నటుడిగా బాలీవుడ్ లో రాణిస్తున్నాడు. పింక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో అంగద్ నెగిటివ్ షేడ్స్ లో నటించిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు