ఆరు కోట్ల కథ అంటివి కదా శంకరా..?

First Published Jun 30, 2018, 2:53 PM IST
Highlights

కమెడియన్ స్థాయి నుండి హీరోగా టర్న్ అయ్యాడు షకలక శంకర్. కమెడియన్ గా అవకాశాలు తక్కువ 

కమెడియన్ స్థాయి నుండి హీరోగా టర్న్ అయ్యాడు షకలక శంకర్. కమెడియన్ గా అవకాశాలు తక్కువ అవ్వడం వలనే తను హీరో అయ్యానని చెప్పుకొచ్చాడు. అతడు నటించిన 'శంభో శంకర' శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.

మన కొత్త హీరో సినిమా రిలీజ్ కు ముందు చేసిన కామెంట్లకు సినిమా రిజల్ట్ కు అసలు పొంతనే లేదు. ఈ కథ పట్టుకొని దిల్ రాజు, రవితేజ, అల్లు శిరీష్ లాంటి వారి దగ్గర తిరిగానని అందరూ చూద్దామనే తప్ప చద్దామని ఎవరూ అనలేదని రెండు కోట్ల పెట్టుబడి పెడితే ఎనిమిది కోట్లు వచ్చే కథను వాళ్లు వదులుకున్నారని సంచనలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సినిమాలో అంత నావల్టీ పాయింట్ ఏముందో అని అందరూ అనుకున్నారు.

తీరా సినిమా చూస్తే ఇది రొటీన్ కే రొటీన్ కథ అని తేల్చేశారు. ఓ ఊరు, ఆ ఊర్లో ప్రెసిడెంట్ అతడికి ఎదురెళ్లే ఓ యువకుడి కథే ఈ సినిమా. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో ఇదే పాయింట్ తో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఆ కథను పట్టుకొని గొప్పలకు పోయాడు శంకర్. సోషల్ మీడియాలో అయితే శంకర్ పై విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. కథలోనే సత్తా లేదంటే ఇక తెరపై షకలక శంకర్ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు.

ఈ సినిమాను ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి చూస్తారనుకోవడం పొరపాటు. అలాంటిది ఆరు కోట్లు ఎక్కడ నుండి వస్తాయి. కనీసం  సినిమాపై పెట్టిన పెట్టుబడి తిరిగొస్తే సంతోషం అన్నట్లుగా ఉన్నారు నిర్మాతలు. 
 

click me!