సమంతకి ఇంత స్వార్ధమా..?

Published : Aug 19, 2019, 01:02 PM IST
సమంతకి ఇంత స్వార్ధమా..?

సారాంశం

సమంత నటించిన 'మహానటి' సినిమాకి గాను కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమనటిగా అవార్డు వచ్చింది. దీనికి సంబంధించిన ఇండస్ట్రీలో చాలా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు. కానీ సినిమాలో కీలకపాత్ర పోషించిన సమంత మాత్రం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. 

అక్కినేని ఇంటి కోడలు సమంతకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో కూడా ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. తన నటనతో పాటు వ్యక్తిత్వంతో కూడా అభిమానులు సంపాదించుకుంది. ఆమెని దగ్గరగా చూసిన వారు డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెబుతుంటారు. అయితే కొన్ని రోజులుగా ఆమె ప్రవర్తన కారణంగా అభిమానులు షాక్ అవుతున్నారు.

గతంలో అక్కినేని ఫ్యామిలీ నుండి ఏ సినిమా వచ్చినా.. తనవంతుగా ప్రమోషన్స్ చేసేది సమంత. కానీ తమ మావయ్య నటించిన 'మన్మథుడు 2' సినిమా విషయంలో మాత్రం సమంత పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కూడా నటించింది. కానీ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. తన కోడలకి సినిమా నచ్చలేదని నాగార్జున స్వయంగా చెప్పాడు.

కాబట్టి ప్రమోట్ చేయలేదనుకుందాం. ఇది ఇలా ఉండగా.. మరోవైపు తాను నటించిన 'మహానటి' సినిమాకి గాను కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమనటిగా అవార్డు వచ్చింది. దీనికి  సంబంధించిన ఇండస్ట్రీలో చాలా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు. కానీ సినిమాలో కీలకపాత్ర పోషించిన సమంత మాత్రం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. మూడు అవార్డులు అందుకున్న 'మహానటి' టీంను కనీసం సోషల్ మీడియాలో విషెస్ కూడా చెప్పలేదు.

పోనీ సమంత ట్విట్టర్ లో యాక్టివ్ గా లేదనుకుంటే అదీ కాదు.. తన 'ఓ బేబీ' సినిమా గురించి ట్వీట్లు వేస్తూనే ఉంది. అలాంటప్పుడు 'మహానటి' సినిమా విషయంలో స్వార్ధం చూపిస్తూ స్పందించకుండా ఎలా ఉంటుందని అభిమానులు హర్ట్ అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?