జస్ట్‌ ఐటమ్‌ సాంగ్‌ అని అంత తేలిగ్గా చూడొద్దు: నీతూ చంద్ర‌

Published : Jan 24, 2017, 11:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
జస్ట్‌ ఐటమ్‌ సాంగ్‌ అని అంత తేలిగ్గా చూడొద్దు: నీతూ చంద్ర‌

సారాంశం

విడుదలకు సిద్ధమైన  సూర్య సింగం-3 మూవీ  సూర్య సరసన హీరోయిన్లుగా న‌టించిన  అనుష్క  శృతిహాసన్‌ ఈ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్ చేసిన హిరోయిన్  నీతూ చంద్ర 

తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కిన 'సింగం-3 విడుదలకు సిద్ధమైన విషయం విదితమే. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. మరోపక్క, ఈ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ చేసింది నీతూ చంద్ర. సినిమా కోసం హీరో హీరోయిన్ల కన్నా సోషల్‌ మీడియా వేదికగా నీతూ చంద్ర చేస్తోన్న ప్రమోషన్‌ ఓ రేంజ్‌లో వుంది. 

చేసింది ఐటమ్‌ సాంగే అయినా, జస్ట్‌ ఐటమ్‌ సాంగ్‌ అని అంత తేలిగ్గా తీసి పారెయ్యద్దంటోందామె. ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం చాలా కష్టపడిందట. ఆ కష్టమేంటో సినిమా చూస్తేనే తెలుస్తుందని చెబుతోందీ బ్యూటీ. జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం వున్న నీతూ, డాన్స్‌లో జిమ్నాస్టిక్స్‌ని మిక్స్‌ చేసేసిందట. చాలాకాలం క్రిందట తెలుగులో 'గోదావరి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకటీ అరా తెలుగు సినిమాల్లో నటించినా, తెలుగు తెరపై పెద్దగా వెలగలేకపోయింది. 

ఇక, 'సి-3' కోసమే నీతూ చంద్ర కాస్త ఒళ్ళు చేసిందట. తమిళ సినీ ప్రేక్షకులు హీరోయిన్లను బొద్దుగా వుంటేనే ఇష్టపడ్తారనీ, అందుకే అలా బొద్దుగా తయారయ్యాననీ, ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం గనుక మళ్ళీ సన్నబడేందుకు నానా తంటాలూ పడాల్సి వచ్చిందని చెబుతోంది. ప్రస్తుతం కొన్ని హిందీ సినిమాలతో బిజీగానే వుందట ఈ భామ. యాక్షన్‌ సినిమాలంటే తనకిష్టమనీ అంటోంది.

PREV
click me!

Recommended Stories

Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
Karthika Deepam 2 Today Episode:కాంచనకు ఒట్టేసిన దీప, కార్తీక్-జ్యోకు షాకిచ్చిన సూరజ్-సుమిత్ర కంగారు