జనవరి 26న జరగాల్సిన గుంటూరోడు ఆడియో వేడుక వాయిదా

Published : Jan 24, 2017, 08:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
జనవరి 26న జరగాల్సిన గుంటూరోడు ఆడియో వేడుక వాయిదా

సారాంశం

జనవరి 26న విపక్షాల ఆందోళనలకు పిలుపు ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో మిన్నంటుతున్న ఆందోళనలు ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందేనంటున్న మంచు మనోజ్  

మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు. చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఆడియో లాంచ్ జనవరి 26 న జరగనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే ఈ చిత్ర ఆడియో లాంచ్ వాయిదా పడినట్లు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.మనోజ్ తన సన్నిహితుల సలహా మేరకే ఆడియో లాంచ్ ని వాయిదా వేసినట్లు తెలిపాడు. కాగా ఈ చిత్రంలో మనోజ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

జనవరి 26న విపక్షాలన్నీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన తలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నానని, ప్రేమతో అహింసాత్మక పోరాటం ద్వారా హోదా సాకారం కావాలని భావిస్తున్నానని ఈ సందర్భంగా మనోజ్ అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

హీరోకి రూ.110 కోట్లు, హీరోయిన్ కి రూ.2 కోట్లు.. ఏమాత్రం సంబంధం లేని రెమ్యునరేషన్స్ వైరల్
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవిగో