పోసానిని మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలి: నిహారిక ఫైర్

Published : Sep 29, 2021, 12:01 PM ISTUpdated : Sep 29, 2021, 04:50 PM IST
పోసానిని మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలి: నిహారిక ఫైర్

సారాంశం

పవన్ కళ్యాణ్ పై నిన్న నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పోసాని కృష్ణమురళిని మానసిక రోగిగా అభివర్ణించిన నిహారిక ఆయనను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి అన్నారు.


పవన్ కళ్యాణ్ పై నిన్న నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. దారుణమైన బూతులతో పవన్ ని కించపరిచిన పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో నిహారిక మీడియాతో మాట్లాడడం జరిగింది. పోసాని కృష్ణమురళిని మానసిక రోగిగా అభివర్ణించిన నిహారిక ఆయనను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వేదికపై ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. పోసానిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ని పవన్ విమర్శించారనే పోసాని అలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. 

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు పవన్‌కు మద్దతుగా వుంటే.. మరికొందరు మాత్రం సైలెంట్‌గా వున్నారు. కానీ పోసాని కృష్ణమురళీ మాత్రం.. రియాక్ట్ అయ్యారు

పవన్ కల్యాణ్ పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని చెప్పారు. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని పోసాని అన్నారు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి.. తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తానూ కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?